English | Telugu

వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా సినిమా

వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా, "కొత్తబంగారులోకం" ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమా తీయాలనుకున్నారు. ఆ సినిమాకి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు" అన్న పేరుని కూడా నిర్ణయించినట్లు అప్పట్లో బాగా వినపడింది.

కానీ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను నటిస్తున్న "దిషాడో" , కమిట్ అయిన "గబ్బర్ సింగ్" సినిమాలతో చాలా బిజీగా ఉండటంతో ఆయన ఈ సినిమాలో నటించట్లేదని తెలిసింది. దాంతో ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్ర కథను ప్రిన్స్ మహేష్ బాబుకి చెప్పాడట. ఆ కథ విన్న మహేష్ బాబు కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. అన్నీ సరిగ్గా జరిగితే వెంకటేష్, మహేష్ బాబు ఇద్దరూ కలసి నటించే సినిమాని ప్రేక్షకులు చూసే అవకాశం అతి తోందర్లోనే ఉంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.