English | Telugu

మీరెంత డబ్బు ఆఫర్ చేసినా అది మాత్రం చేయనంటున్న శ్రీలీల

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులెప్పుడు ఒకేలా ఉండవనడానికి నయా ఉదాహరణ శ్రీలీల(sreeleela)ఏడాది క్రితం ఫుల్ బిజీ. పైగా మాములు బిజీ కాదు.చేస్తున్న సినిమాలే గాక చేతిలో ఎప్పుడు కొత్త సినిమాల డేట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్లాప్ ల దిష్టి తగిలి కొత్త నిర్మాతలు శ్రీ లీల వైపు చూసే సాహసం చెయ్యటం లేదు. బహుశా పరిస్థితులు ఇలా వస్తాయనే తెలిసే మెడిసిన్ కి కూడా ప్రిపేర్ అయ్యిందనుకుంటా. ఇక లేటెస్ట్ గా కొన్ని సినిమాలకి నో చెప్పింది.

శ్రీలీల ఎంత సూపర్ డాన్సరో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అసలు ఈ మధ్య కాలంలో శ్రీలీల లా డాన్స్ చేసే హీరోయిన్ వచ్చినట్టు దాఖలాలు కూడా లేవు. ఇది దృష్టిలో పెట్టుకునే శ్రీలీల కి రెండు భారీ సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. ప్రెజంట్ తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న రెండు ప్రతిష్టాత్మక సినిమాల్లో ఐటెం సాంగ్స్ కోసం మేకర్స్ శ్రీలీల ని సంప్రదించారట. ఇందుకు గాను భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేసారని, కానీ శ్రీ లీల మాత్రం ఎంత డబ్బిచ్చినా సరే ఐటెం సాంగ్స్ చెయ్యనని ఖరాకండిగా చెప్పిందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. తన కెరీర్ కి మళ్ళీ బూస్టప్ వస్తుందనే నమ్మకంతోనే ఆ నిర్ణయం తీసుకుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక కాజల్, తమన్నా వంటి హీరోయిన్లు సైతం తమ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు బడా మూవీస్ లో ఐటెం సాంగ్స్ చెయ్యడానికి వెనుకాడలేదు. అలాంటిది శ్రీ లీల తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పవన్ కళ్యాణ్(pawan kalyan)ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు నితిన్(Nithiin)రాబిన్ హుడ్ లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిటిపైనే తన ఆశలన్నీ ఉన్నాయి. చివరిగా మొన్న సంక్రాంతికి మహేష్ గుంటూరు కారంలో అమ్ముగా అలరించింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.