English | Telugu

చిరంజీవి పుట్టిన రోజుకి ప్రభాస్ కల్కి గిఫ్ట్  

జూన్ 27 న ప్రభాస్(prabhas)పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడి(kalki 2898 ad)విడుదలై వరల్డ్ వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరకి తెలిసిన విషయమే. కల్కి హంగామా థియేటర్ లో కొనసాగుతున్నంత సేపు వేరే సినిమాలు ఆ వైపు చూడటానికి కూడా సాహసం చెయ్యలేదు. అంతలా కల్కి మానియా సాగింది. అంతే కాదు ఆ మానియా ఇప్పట్లో ఆగదని తాజా సంఘటన ఒకటి చెప్తుంది.

ఓటిటి వేదికగా కల్కి ఈ రోజు హిందీ లాంగ్వేజ్ కి సంబంధించి నెట్ ఫ్లిక్స్(netflix)లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అలాగే అమెజాన్ ప్రైమ్(amazon prime)వీడియో ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు ఇండియన్ సినీ ప్రేక్షకులు మొత్తం కల్కి ని వీక్షిస్తున్నారు. దీంతో కల్కి హ్యాష్ టాగ్ ఇప్పుడు నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. దీంతో చిరంజీవి పుట్టిన రోజు కి ప్రభాస్ మంచి గిఫ్ట్ ఇచ్చినట్టయ్యిందంటూ ఇరువురు ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చిరు ప్రభాస్ లు కూడా ఒకరికొకరు చాలా ఆప్యాయంగా ఉంటారని తెలిసిన విషయమే. ప్రభాస్ తో పాటుగా అమితాబ్, కమల్ , దీపికా పదుకునే ఉండటం కల్కి కి స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.