English | Telugu

సోనాక్షి పై క‌ర్చీప్ వేసిన బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. లెజెండ్ ఇచ్చిన బూస్ట్ తో ఆయ‌న స్పీడు పెంచారు. ప్ర‌స్తుతం 98వ చిత్రం ర‌న్నింగ్‌లో ఉంది. 2015 లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 100వ సినిమాకి కొబ్బ‌రికాయ్ కొట్టేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఈ ప్రాజెక్టు బోయ‌పాటి శ్రీ‌నుకే క‌న్‌ఫామ్ చేసేశార‌ని టాలీవుడ్ టాక్‌. 99వ సినిమా పూర్త‌య్యేలోగా బ‌న్నీ - బోయ‌పాటి సినిమా కూడా అయిపోతుంది. అప్పుడు అటు బాల‌య్య‌, ఇటు బోయ‌పాటి ఇద్ద‌రూ ఫ్రీగానే ఉంటారు. సో.. 100వ సినిమాకి ద‌ర్శ‌కుడిని వెతుక్కొనే బాధ త‌ప్పింది. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న చిత్రం త‌ర‌పున సాయి కొర్ర‌పాటి నిర్మిస్తారు. ఇప్పుడు కావ‌ల్సింది క‌థానాయిక‌. బాల‌య్య సినిమా అనేస‌రికి క‌థానాయిక స‌మ‌స్య ముంచుకొచ్చేస్తుంది. ఆ ఇబ్బంది త‌న 100వ సినిమాకి రాకుండా ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త‌లు తీసుకొంటున్నారు. ఓ బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కి ముందే అడ్వాన్సు ఇచ్చేసి క‌ర్చీప్ వేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. ఇప్పుడు బాల‌య్య దృష్టి సోనాక్షి సిన్హాపై ప‌డింది. సోనాక్షి చేతికి అడ్వాన్సు ఇచ్చి 2015 నాటికి కొన్ని కాల్ఫీట్లు తీసేసుకోవాల‌ని సాయికొర్ర‌పాటి తీవ్ర ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ట‌. క‌థ ఏమీ లేకుండా సోనాక్షి ఈ సినిమా ఎలా ఒప్పుకొంటుంద‌న్న డౌట్ వద్దు. ఆల్రెడీ బోయ‌పాటి ద‌గ్గ‌ర బాల‌య్య కు సంబంధించి ఓ ప‌వ‌ర్‌ఫుల్ లైన్ ఉంద‌ట‌. అది చెప్పి మేనేజ్ చేయొచ్చ‌ని సాయి కొర్ర‌పాటి భావిస్తున్నారు. 2015 వేస‌విలో ఈ సినిమాని ప్రారంభించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈలోగా 99వ సినిమా ఎవ‌రితో చేస్తారో తేలాల్సివుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.