English | Telugu

ఆ హీరో గే.. అతని భార్యకి వేరే వారితో ఎఫైర్.. అందుకే విడాకులు!

అప్పట్లో సుచి లీక్స్ (Suchi Leaks) ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ లీక్స్ కోలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేశాయి. సింగర్ సుచిత్ర, లీక్ చేసిందంటూ.. అప్పట్లో ధనుష్, శింబు, త్రిష, హన్సిక వంటి ఎందరో సెలబ్రిటీల ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు విడుదలయ్యాయి. ఆ వీడియోలు నిజమని నమ్మిన వారున్నారు. ఫేక్ అని కొట్టిపారేసిన వారు కూడా ఉన్నారు. మరోవైపు సుచిత్ర మతిస్థిమితం కోల్పోయిందని, అందుకే తనకు తెలియకుండానే నిరాధార ఆరోపణలతో, సినీ తారలను టార్గెట్ చేస్తుందని ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అప్పట్లో సుచి లీక్స్ దెబ్బకి.. ఎందరో కోలీవుడ్ స్టార్స్ షేక్ అయ్యారు. అయితే కొంతకాలంగా సుచిత్ర సైలెంట్ గా ఉండటంతో.. ఇప్పుడు అంతా సెట్ అయిందని భావించారంతా. కానీ ఉన్నట్టుండి తాజాగా మరోసారి సుచి లీక్స్ తెరపైకి వచ్చింది.

ధనుష్ (Dhanush), ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరిపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్ చేసింది. ధనుష్, ఐశ్వర్య ఒకరినొకరు చీట్ చేసుకున్నారని చెప్పింది. ఐశ్వర్య వేరే వారితో రిలేషన్ లో ఉందని, అలాగే ధనుష్ కి కూడా పలు ఎఫైర్లు ఉన్నాయని సుచిత్ర చెప్పుకొచ్చింది.

ఇక ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన జి.వి. ప్రకాష్, సింగర్ సైంధవిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది సుచిత్ర. సింగర్స్ సైంధవి, కార్తీక్ మధ్య సీక్రెట్ రిలేషన్ ఉందంటూ కామెంట్స్ చేసింది. ఇక ధనుష్, జి.వి. ప్రకాష్ గురించి ఆమె చేసిన గే కామెంట్ షాకింగ్ గా మారింది. తన మాజీ భర్త కార్తీక్ తో పాటు ధనుష్, జి.వి. ప్రకాష్ స్వలింగ సంపర్కులని బాంబు పేల్చింది. ధనుష్ కి తెల్లవారుజామున మూడు గంటల వరకు గడిపే ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది. సుచిత్ర తాజా కామెంట్స్ మరోసారి కోలీవుడ్ ని కుదిపేస్తున్నాయి. అయితే ఆమె డిప్రెషన్ లో ఉందని, మానసిక స్థితి సరిగా లేకనే ఇటువంటి కామెంట్స్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.