English | Telugu

సిద్ధార్థ 180 ఆడియో రిలీజ్

సిద్ధార్థ 180 ఆడియో రిలీజ్ చేయబడింది. వివరాల్లోకి వెళితే సత్యం సినిమా, అఘళ్ ఫిలింస్ పతాకాలపై, సిద్ధార్థ హీరోగా, నిత్య మీనన్, ప్రియ ఆనంద్ హీరోయిన్లుగా, యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం"180". ఏప్రెల్ 21 వ తేదీ ఉదయం ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ ల చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో విడుదల ప్రసాద్ ఐమ్యాక్స్ లో జరిగింది. ఈ ఆడియో విడుదల ఫంక్షన్ కి హీరోలు రామ్, సునీల్, సిద్ధార్థ హీరోయిన్లు నిత్య మీనన్, ప్రియ ఆనంద్, శృతి హాసన్ నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, శ్యాం ప్రసాద రెడ్డి, దర్శకురాలు నందినీ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు జయేంద్ర ప్రసంగిస్తూ తాను కొన్ని వందల యాడ్ ఫిల్ములకు దర్శకత్వం వహించాననీ, ప్రస్తుతం తన తోటి వారందరూ రిటైర్ అయ్యే స్థితిలో ఉండగా తాను ఇలా సినీ దర్శకుడిగా రావటం ఆనందంగా ఉందనీ, ఈ చిత్రంలో హీరోగా సిద్ధార్థ మాత్రమే సరిపోతాడనీ, ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనీ అన్నారు. హీరో సిద్ధార్థ ప్రసంగిస్తూ దర్శకులు జయేంద్ర తనకు చిన్నప్పటి నుండీ తెలుసుననీ, ఈ సినిమా తనకు మరో మంచి హిట్ చిత్రంగా మిగిలిపోతుందన్న నమ్మకం ఉందనీ అన్నారు. రామ్, శృతి హాసన్ 180 చిత్రం వెబ్ సైట్ ను లాంచ్ చేశారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.