English | Telugu
పవన్ కళ్యాణ్ పై శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు..ప్రేమంటే నమ్మకం, పెళ్లంటే భయం
Updated : Jul 11, 2025
యూనివర్సల్ స్టార్ 'కమల్ హాసన్'(Kamal Haasan)నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన నటి శృతి హాసన్(Shruthi Haasan). అనతి కాలంలోనే తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ని పొందింది. తను ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్ అనే రీతిలో 'గోల్డెన్ లెగ్'(Golden Leg)అనే టాగ్ లైన్ ని కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం రజనీకాంత్(Rajinikanth),నాగార్జున(Nagarjuna),లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)ల 'కూలీ'(Coolie)ద్వారా ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన సినీ జర్నీతో పాటు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతు 'గబ్బర్ సింగ్'(Gabbar Singh)మూవీలో చెయ్యడానికి దర్శకుడు 'హరీష్ శంకర్'(Harish Shankar)నన్ను సంప్రదించినప్పుడు కొన్ని కారణాల వల్ల చెయ్యనని చెప్పాను. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)లాంటి బిగ్ స్టార్ తో చెయ్యడానికి కూడా భయమేసింది. హరీష్ మాత్రం నన్ను తప్ప వేరే వాళ్ళని ఆ క్యారక్టర్ కి ఉహించుకోలేనంటే భయపడుతూనే చేశాను. పవన్ కళ్యాణ్ సెట్ లో నన్ను ఎంతగానో గౌరవించారు. మూవీ పెద్ద హిట్ అవ్వడంతో నా సినీ లైఫ్ మారిపోయింది.
నాకంటు ప్రత్యేక గుర్తింపుతో, కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదగడానికి చాలా కష్ట పడ్డాను. ఈ గుర్తింపుని ఒక కాగితపు ముక్కతో ముడిపెట్టాలనే ఆలోచన వస్తుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది. వివాహ బంధాన్ని గౌరవిస్తాను. కానీ అందుకు రూల్స్ అక్కరలేదని నా అభిప్రాయం. అందుకే ప్రేమపై నమ్మకం ఉన్నప్పటికీ వివాహ బంధం పట్ల భయంగా ఉంది. గతంలో పెళ్లి దాకా వెళ్ళాను. కానీ మధ్యలోనే ఆగిపోయింది. పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు కలవడం కాదు. జీవితాంతం ఒకరి బాధ్యతని మరొకరు తీసుకోవడం. మా నాన్న నమ్మకపోయినా నేను జ్యోతిష్యాన్ని నమ్ముతానని శృతి చెప్పుకొచ్చింది. గాయనిగా కూడా శృతి రాణిస్తున్న విషయం తెలిసిందే.