English | Telugu

శివరాజ్ కుమార్ కి అమెరికాలో సర్జరీ..అందరిలో టెన్షన్ 

కన్నడ స్టార్ హీరో శివరాజ్(shiva rajkumar)కుమార్ రీసెంట్ గా 'భైరతి రణగల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తెలుగులో కూడా అదే పేరుతో విడుదలయ్యి మంచి ప్రేక్షకాదరణని సొంతం చేసుకుంది.ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శివ రాజ్ కుమార్ మాట్లాడుతు నాకు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది.ఆ విషయం నాకు ఫస్ట్ టైం తెలిసినప్పడు షాక్ అయ్యాను.కానీ ఇప్పుడు దైర్యంగా ఉన్నాను ఎవరు ఆందోళన చెందవద్దు.అందుకు సంబంధించిన ట్రీట్ మెంట్ ని కూడా తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది.

రీసెంట్ గా అందుకు సంబంధించిన సర్గరీ చేయించుకోవడానికి శివ రాజ్ కుమార్ అమెరికా బయలుదేరాడు.ఈ సందర్భంగా బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతు ఈ నెల 24 న సర్గరీ జరగనుంది.సాధారణంగా నేను చాలా దైర్యంగా ఉంటాను.కానీ సర్జరీ నిమిత్తం వెళ్తున్నపుడు నా కుటుంబ సభ్యుల్ని,సన్నిహితులని,అభిమానుల్ని చూసినప్పుడు కొంచం భావోద్వేగానికి లోనయ్యాను.చికిత్స పూర్తయిన తర్వాత యుఐ,మాక్స్ సినిమాలు చూస్తానని చెప్పుకొచ్చాడు.

ఇక శివరాజ్ కుమార్ అమెరికా వెళ్లనున్నాడని తెలియడంతో పలువురు సినీ నటులు, దర్శకులు,అభిమానులు ఆయన నివాసానికి చేరుకొని ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.అమెరికా బయలు దేరే ముందు శివరాజ్ కుమార్ ఇంట్లో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం కూడా జరిగింది. అభిమానులు కూడా తమ అభిమాన నటుడు శివన్నఅమెరికా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవాలయాల్లో,మసీదుల్లో,చర్చిల్లో పూజలు జరిపిస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.