English | Telugu
రామ్ కందిరీగలో శ్రియ ఐటం సాంగ్
Updated : Apr 18, 2011
రామ్ "కందిరీగ" చిత్రంలో ప్రముఖ హీరోయిన్ శ్రియా శరణ్ ఒక ఐటం సాంగ్ లో నటించనుందట. శ్రియకు తెలుగులో సినిమాలు లేకపోవటం వలన ఇలా ఐటం సాంగ్స్ లో అయినా నటిస్తూ తన ఉనికిని చాటుకుంటూ ఉంటే ఏదోక సినిమా లో తనకు హీరోయిన్ గా అవకాశం దక్కితే మళ్ళీ పూర్వవైభవం పొందచ్చనే ఆలోచనలో ఉందట.
గతంలో కూడా రామ్ హీరోగా నటించిన తొలి చిత్రం "దేవదాసు" చిత్రంలో కూడా శ్రియ ఒక ఐటం సాంగ్ లో నటించింది. అందుకే సెంటిమెంట్ పరంగా మళ్ళీ రామ్ హీరోగా నటిస్తున్న ఈ "కందిరీగ" చిత్రంలో శ్రియ ఐటం సాంగ్ లో నటిస్తూందని సమాచారం. ఈ రామ్ "కందిరీగ" చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తూండగా, ఆండ్ర్యూ సినిమాటోగ్రఫీని, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని నిర్వహిస్తున్నారు.