English | Telugu

Shekhar home Review: శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ రివ్యూ


వెబ్ సిరీస్ : శేఖర్ హోమ్
నటీనటులు: కేకే మీనన్, రణ్ వీర్ షోరే , రసిక దుగల్ , కీర్తీ కుల్హారీ, షెర్నాజ్ పటేల్, కౌశిక్ షేన్, సలీమ్ సిద్దిఖీ తదితరులు
రచన : అనిరుద్ధ గుహ
ఎడిటింగ్: సౌరభ్ ప్రభుదేశాయ్
మ్యూజిక్: జోయల్ క్రాస్టో
నిర్మాతలు : సమీర్ గోగతే
దర్శకత్వం: శ్రీజిత్ ముఖర్జీ, రోహన్‌ సిప్పీ
ఓటీటీ: జియో సినిమా

కథ:

అర్థరాత్రి ఇద్దరు పోలీసులు నైట్ డ్యూటీ చేస్తుంటారు. అందులో ఒకతను కాస్త దూరం వచ్చి చూసి షాకై.. మరో పోలీస్ ని పిలుస్తాడు‌. ఇక కథ పన్నెండ గంటల వెనెక్కి వెళ్తుంది. కాషా బ్లాన్సర్ అనే హోటల్ కి జయవ్రత్ షైనీ(రణ్ వీర్ షోరే) వస్తాడు. ఇక ఆ హోటల్ యజమాని మిస్సెస్ హెచ్ తనకి ఓ రూమ్ కి అద్దెకి ఇస్తుంది. అదే శేఖర్(కేకే మీనన్). ఇక మిస్సెస్ హెచ్ కింద పనిచేసే బిట్టు అనే వ్యక్తి జయవ్రత్ షైనీ కి తన గదిని చూపిస్తాడు. అయితే ఆ గది తాళం శేఖర్ దగ్గరే ఉండటంతో అతన్ని వెతుక్కుంటూ జయవ్రత్ షైనీ, బిట్టు వెళ్తారు. ఇక రిక్షా నడుపుతూ తప్పిపోయిన మేకని శేఖర్ కనిపెట్టడంతో అది చూసిన జయవ్రత్ షైనీ ఇంప్రెస్ అవుతాడు. అయితే మరుసటి రోజు ఉదయం శేఖర్ దగ్గరికి ఓ పోలీస్ వచ్చి‌‌.. మర్డర్ జరిగిందని ఇన్వెస్టిగేషన్ చేయాలని సహకరించమంటాడు. దాంతో శేఖర్ సరేనని కేసుని సాల్వ్ చేస్తాడు. శేఖర్ హోమ్ ఎవరు? ప్రాజెక్టు ఎమ్ ఎవరు? అసలు జయవ్రత్ షైనీకి శేఖర్ హోమ్ కి గల సంబంధం ఏంటనేది మిగతా కథ.

విశ్లేషణ:

కేకే మీనన్ కథా ఎంపికే భిన్నంగా ఉంటుంది‌. రైల్వే మెన్ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కేకే నటించిన ఈ ' శేఖర్ హోమ్ '.. సూపర్ ట్విస్ట్ లతో సాగుతుంది. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. ప్రతీ క్రైమ్ ని ఇన్వెస్టిగేషన్ చేసిన తీరు చివరు వరకు చూసేలా చేస్తుంది.

కథలో ఆరు ఎపిసోడ్‌లు ఉంటాయి. అవి మారుతున్న కొద్ది ప్రదేశాలు, కేసులు మారుతుంటాయి. అయితే ఆ ఎపిసోడ్ లో క్యారెక్టర్లు కూడా ఎక్కువగా ఉండకుండా .. ఫస్ట్ నుండి చివరి వరకు ఓ అరడజను పాత్రలే ఉంటాయి. కథా వస్తువుగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తీసుకున్నాడు దర్శకుడు. ఇందులో క్రైమ్ వివరించే ప్యాట్రన్.. హీరో ఇంటలిజెన్స్.. విలన్ ఎవరా అని సాగే సస్పెన్స్ సిరీస్ ని స్కిప్ చేయనీయవు.

ఆయితే ఇందులో అడల్ట్ సీన్లకి ఎక్కువగా ప్రధాన్యత ఇవ్వలేదు. అసభ్య పదజాలం వాడలేదు. ఫ్యామిలీతో కలిసి చూసేలా మేకర్స్ తీసారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ప్లస్ కథ వర్కవుట్ అయ్యాయి. ‌ముఖ్యంగా ఆ 'యూ ప్యాట్రన్' తరహాలో చంపే సీరియల్ కిల్లర్ ని పట్టుకునే ఎపిసోడ్, చివరగా బాక్స్ కనిపెట్టే ఎపిసోడ్, ప్రాజెక్టు ఎమ్ .. ఇలా ప్రతీ ఎపిసోడ్ ఇంటెన్స్ డ్రామాతో సాగుతుంది. ఫోరెన్సిక్ ఆఫీసర్ కేసుని డీల్ చేసే విధానం, ఆ డీటేయిలింగ్ ప్రేక్షకుడిని ఈ సిరీస్ కి కట్టిపడేస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. పాటలు కూడా సీన్ కి తగ్గట్టుగానే తీసారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్, బిజిఎమ్ సిరీస్ కి ప్రధాన బలం. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

శేఖర్ హోమ్ గా కేకే మీనన్, జయవ్రత్ షైనీగా రణ్ వీర్ షోరే, ఇరబోటిగా రసిక దుగల్ , ముంతాజ్ గా కీర్తీ కుల్హారీ ఆకట్టుకున్నారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : ఎంగేజింగ్ ప్రెజెంటేషన్ తో సాగే ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని డోంట్ మిస్ .

రేటింగ్: 3 / 5

✍️. దాసరి మల్లేశ్

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.