English | Telugu
ఆమెకు పైసా కూడా ఇవ్వలేదట
Updated : Nov 17, 2015
అఖిల్ సినిమా కోసం అఖిల్ దాదాపుగా రూ.6 కోట్ల పారితోషికం అందుకొన్నాడని టాక్. వినాయక్ కి అయితే ఏకంగా రూ.12 కోట్లు అప్పగించారట. మరి సాయేషాకు ఎంతిచ్చారు?? ముంబై ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌కి ఇదే తొలి సినిమా. ఆమె కూడా ఉన్నత `నట` కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే. తనకీ భారీ ఎత్తున పారితోషికం ఇచ్చుంటారని అనుకొంటారు. అయితే.. అంత సీన్ లేదిక్కడ. సాయేషాకు ఒక్క పైసా పారితోషికం కూడా ఇవ్వలేదట. `సినిమా పూర్తయ్యాక నీ పారితోషికం కోసం ఆలోచిద్దాం` అని చెప్పిన దర్శక నిర్మాతలు.. అఖిల్ విడుదలకు ముందే చేతులెత్తేశారట. కనీసం తనకు పబ్లిసిటీ కూడా ఇవ్వలేదని సాయేషా తెగ ఫీలైపోయిందని సమాచారం. ఆఖరికి తన ఇంటర్వ్యూలను సొంత డబ్బులు ఖర్చు చేసిందట. సెట్లో మహారాణిలా చూసుకొన్నారని, అయితే సినిమా పూర్తవ్వగానే తనని పట్టించుకోవడం మానేశారని, కథ చెబుతున్నప్పుడు తన పాత్ర ఒకలా ఉందని, తెరపై చూసుకొంటే మరోలా కనిపించిందని, అఖిల్ పాత్ర ఎలివేట్ చేయడానికి తన పాత్రని తొక్కేశారని తెగ ఫీలవుతోందట సాయేషా. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదే.