English | Telugu

వీడియో: రవితేజ 'బెంగాల్ టైగర్' టీజర్

బెంగాల్ టైగర్ టీజర్ చాలా పవర్ ఫుల్ గా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ సినిమాతో మళ్ళీ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే రవితేజ డిసైడ్ అయ్యాడు. ‘‘నేను క్లైమాట్ లాంటోణ్ని. కొన్నిసార్లు చల్లగా ఉంటా. కొన్నిసార్లు వెచ్చగా ఉంటా. అలాగే కొన్నిసార్లు వణికించేస్తా’’ అంటూ మాస్ మహారాజ్ రవితేజ తనదైన స్టయిల్లో డైలాగ్ మోత మోగించాడు. చివర్లో కొసమెరుపుగా తమన్నా వచ్చి అందాల వల విసిరింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.