English | Telugu

పవన్ కళ్యాణ్ తో త్వరలో సంపత్ నంది మూవీ

సుమ అడ్డా ఈ వారం షో ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి "ఓదెల 2 " మూవీ టీమ్ వచ్చింది. హెబ్బా పటేల్, సంపత్ నంది, మహేష్, సుదర్శన్, వసిష్ఠ వచ్చారు. వీళ్ళతో సుమ గేమ్స్ ఆడించింది. తర్వాత రాపిడ్ ఫైర్ ఆడించింది. ఇందులో ఈ టీమ్ మొత్తాన్ని కొన్ని ప్రశ్నలు అడిగింది. "రామ్ లేదా నిఖిల్...వీళ్ళలో ఎవరితో డేట్ కి వెళ్తావ్" అనేసరికి "నిఖిల్ కి పెళ్లయిపోయింది కాబట్టి రామ్ తో డేట్ కి వెళ్తాను" అని చెప్పింది. "కుమారి 21 ఎఫ్ మూవీ వలన మంచి పేరు వచ్చింది. కానీ ఓదెల మూవీ ద్వారా మంచి పెర్ఫార్మర్ గా ప్రజల నుంచి అప్రిసియేషన్ వచ్చింది" అని చెప్పింది హెబ్బా పటేల్. తర్వాత సంపత్ నందిని ర్యాపిడ్ ఫైర్ ఆడించింది. "ఓదెల మూవీకి ఎవరు న్యాయం చేశారు" అని అడిగింది సుమ. "ఓదెల 1 కి హెబ్బా , ఓదెల 2 కి తమన్నా న్యాయం చేశారు" అని చెప్పాడు. "ఈ స్టార్ హీరోలతో అవకాశం వస్తే ఎవరితో సినిమా చేస్తారు రామ్ చరణ్ తోనా పవన్ కళ్యాణ్ తోనా" అని అడిగింది సుమ.

రచ్చ మూవీని రామ్ చరణ్ గారితో చేసాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి అనుకుంటున్నా అని ఆన్సర్ ఇచ్చాడు. తర్వాత రంగస్థలం మహేష్ ని పిలిచి అడిగేసరికి తనకు జబర్దస్త్ వల్ల పేరు వచ్చిందని మూవీస్ ద్వారా పెర్ఫార్మెన్స్ కి మంచి పేరొచ్చిందని చెప్పాడు. అలాగే ఇంటర్వెల్ ముందు రంగస్థలం, ఇంటర్వెల్ తర్వాత తండేల్ మూవీస్ ద్వారా తన క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయ్యిందని చెప్పాడు. ఓదెల 1 సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మంచి థ్రిల్లర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .