English | Telugu

ఎన్టీఆర్ 'డ్రాగన్' నుంచి బిగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ డేట్ కూడా లాక్!

ఈ ఏడాది ఆగస్టు 14న హిందీ ఫిల్మ్ 'వార్-2'తో ప్రేక్షకులను పలకరించనున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ మూవీకి 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం.

'డ్రాగన్' మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మొదట ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరించారు. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. మే 15 వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్ర‌శాంత్ నీల్ ప్లాన్ చేశాడట. కేజీఎఫ్, సలార్ సినిమాల్లోని ఫైట్స్ ని తలదన్నేలా దీనిని డిజైన్ చేశారట. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.

ఎన్టీఆర్ లుక్ పై కూడా ప్రశాంత్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత చిత్రాలకు భిన్నంగా ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించనున్నాడని వినికిడి. అంతేకాదు, ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలకి ముహూర్తం కూడా ఖరారైందట. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఫస్ట్ లుక్ రివీల్ చేయబోతున్నారని సమాచారం. ఈ లుక్ ఫ్యాన్స్ కి ట్రీట్ లా ఉంటుందని టాక్.

'డ్రాగన్'ను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, షూటింగ్ ఆలస్యంగా మొదలు కావడంతో.. 2026 వేసవికి విడుదలయ్యే అవకాశముంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.