English | Telugu
సమంత కన్నీళ్ళకి కారణం అదే!
Updated : Jan 9, 2023
సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రధారులుగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'శాకుంతలం'. దిల్ రాజు సమర్పణలో గుణటీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం భారీస్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. హైదరాబాద్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో గుణశేఖర్ మాట్లాడుతుండగా సమంత ఎమోషనల్ అయింది.
"శాకుంతలం సినిమాకి ముగ్గురు హీరోలు ఉన్నారు. కథ పరంగా దేవ్ మోహన్ హీరో అయితే, సినిమా పరంగా సమంత హీరో. తెర వెనుక హీరో దిల్ రాజు" అంటూ ఒక్కసారిగా గుణశేఖర్ ఎమోషనల్ అయ్యాడు. ఆయనను అలా చూసి సమంత కూడా బాగా ఎమోషనల్ అయింది. ఒక ఫిల్మ్ మేకర్ కి నిర్మాత సపోర్ట్ ఎంతో అవసరమని, ఈ సినిమా విషయంలో దిల్ రాజు ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేనని, అందుకే ఇంత ఎమోషనల్ అయ్యానని గుణశేఖర్ చెప్పుకొచ్చాడు.
ఈ వేడుకలో సమంత మాట్లాడుతూ.. గుణశేఖర్ గారి మీద ఉన్న గౌరవం వల్ల ఓపిక తెచ్చుకొని ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పింది. మనందరికీ సినిమా అనేది జీవితంలో ఒక భాగమైతే, ఆయనకు మాత్రం సినిమానే జీవితమని.. ఈ సినిమాని కూడా ప్రాణం పెట్టి తీశారని తెలిపింది. తాను ఊహించిన దానికంటే సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పింది. తాను జీవితంలో ఎన్నో బాధలు అనుభవించినా, తనకు సినిమాపై ప్రేమ దూరం కాలేదని, ఎప్పుడూ ఆ ప్రేమ అలాగే ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది.