English | Telugu

లక్కీ గర్ల్స్ తో బన్నీ రొమాన్స్

అత్తారింటికి దారేది సినిమాలో అక్కా చెల్లెళ్లుగా నటించారు సమంత, ప్రణీత. ఆ సినిమా ఎన్నో ఆటంకాలను తట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది. ఆ చిత్ర విజయానికి కారణం వీరిరువురు అని, ఇద్దరూ తెరపై కనిపిస్తే లక్కే లక్కు అని చిత్ర పరిశ్రమలో ఓ నమ్మకం ఏర్పడింది. ఆతరువాత వీరిద్దరూ రిలీజ్ కి సిద్దంగా వున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోను నటించారు. ఆ సినిమా విడుదలకు ముందే మంచి బిజినెస్ చేయడం, అలాగే సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ వుండడంతో వీళ్ళ లక్ తారక్ కి కూడా కలిసివస్తుందని అంటున్నారు. తాజాగా వీరిద్దరూ మరో అగ్రహీరో సరసన నటించే చాన్స్ కొట్టేశారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమాలో మొదట సమంత ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా మరో హీరోయిన్‌గా ప్రణీతను తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో సమంత, ప్రణీతలు కలిసి నటిస్తున్న మూడో చిత్రం ఇది! హిరో, హీరోయిన్ల ఎంపిక పూర్తికావడంతో వచ్చేనెల ఫస్ట్‌వీక్‌లో సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమని టాక్.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.