English | Telugu

ప్రభాస్‌ని మైమరపిస్తున్న సాయి ధరమ్ తేజ్

మొదట్లో, మామయ్య పోలికలు ఉన్నాయి అదృష్టవంతుడన్నారు... తర్వాత, డాన్సులు బాగానే చేస్తున్నాడు, మంచి స్టోరీలు ఎన్నుకుంటే మంచి స్థాయికి వెళ్తాడు అన్నారు... కథలు కూడా బానే ఎంచుకుంటున్నాడే, త్వరలోనే స్టార్ హీరో హోదా అందుకుంటాడు అని అభిప్రాయ పడ్డారు... ఆ మధ్యలో కొన్ని ప్లాప్ సినిమాల్లో నటించినా, పర్లేదు ఈ కుర్రాడు మెల్లిగా తేరుకుంటాడు అని నమ్మారు... ఇప్పుడు, ఈ హీరో ని ఏకంగా ప్రభాస్ అంత అందంగా ఉన్నావు అని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ అయన ఎవరంటారా, మన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అండి.

మేన మామ చిరంజీవి పోలికలతో ఉండడం ఒక రకంగా సాయి ధరమ్ తేజ్ అదృష్టవంతుడే. సినిమా, సినిమాకి కొత్త లుక్స్ ట్రై చేసిన ఈ మెగా హీరో, తన కొత్త చిత్రం జవాన్ లో ఇంతకుమునుపెన్నడూ చూడనంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. మిర్చి సినిమాలో ప్రభాస్ ని చూసి అనుష్క ఒక మాట అంటుంది- ఏమున్నాడ్రా బాబూ అని. ఇప్పుడు జవాన్ లో సాయి ధరమ్ తేజ్ ని చూసి అమ్మాయిలు కూడా ఇదే మాట అంటున్నారు. ఇండస్ట్రీ లో కూడా ప్రభాస్ తర్వాత అంత హ్యాండ్సమ్ హీరో తేజ్ యే అని అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు విడుదలవుతున్న జవ్వాన్ లో... షార్ట్ హెయిర్ కట్, పర్ఫెక్ట్ ఫిజిక్, స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో సాయి ధరమ్ తేజ్ చాలా కొత్తగా, చూడ ముచ్చటగా కనిపిస్తున్నాడు.

మంచి కథలు పడటమే తరువాయి, స్టార్ హీరో స్టేటస్ అందుకోవడం స్వతహాగా మంచి నటుడయిన తేజ్ కి పెద్ద కష్టమయిన పనేం కాదు. ఒకే రకమయిన మూస కథలు కాకుండా ప్రయోగాలు చేస్తుండడం ఈ మెగా హీరో కి కలిసొచ్చే అంశాలు. మరి ఇన్ని పాజిటివ్స్ ఉన్న సాయి ధరమ్ తేజ్, తన కెరీర్ ని ఎలా బిల్డ్ చేసుకుంటాడో చూడాలి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.