English | Telugu
ఆ కేసు నుంచి షారుఖ్ ఖాన్‌కు ఊరట
Updated : Jun 20, 2014
బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్ సెరగేటరీ ద్వారా మూడవ సంతానాన్ని పొందిన క్రమంలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వాహించారని ఆరోపణలు వచ్చాయి. సామాజిక కార్యకర్త వర్షాదేశ్ పాండే షారుఖ్ ఖాన్ దంపుతులపై కేసు ఫైలు చేశారు. ఈ కేసులో వీరికి ఊరట లభించినట్లు తెలుస్తోంది. గురువారం ముంబాయి హైకోర్టు ఈ కేసును తోసిపుచ్చింది. కింద కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. వారి మూడో సంతానం విషయంలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఈ దంపతులు ప్రయత్నించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు నమోదు అయ్యింది. హైకోర్టు ఉత్తర్వులతో కేసు నుంచి బయటపడిన షారుఖ్, గౌరీలు సంతోషం వ్యక్తం చేశారు.