English | Telugu
అది చెయ్యకపోవడం వల్ల అవకాశాలు కోల్పోయాను
Updated : Feb 14, 2025
2012 లో మహేష్ బాబు(maheshbabu)బావ సుధీర్ బాబు(Sudheerbabu)హీరోగా వచ్చిన 'ఎస్ఎంఎస్' అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన భామ రెజీనా కసాండ్రా(Regina Cassandra)ఆ తర్వాత 'రొటీన్ లవ్ స్టోరీ,కొత్త జంట,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,పిల్ల నువ్వు లేని జీవితం,శౌర్య,ఎవరు వంటి పలు విభిన్నమైన సినిమాల్లో చేసింది.తొమ్మిది సంవత్సరాల వయసు నుంచే నటించడం ప్రారంభించిన రెజీనా తమిళ,కన్నడ సినిమాల్లో కూడా చేసింది.ఇటీవల అజిత్ హీరోగా వచ్చిన 'విడామయుర్చి' సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కనిపించింది.
రీసెంట్ గా రెజీనా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు పాతికేళ్లుగా ఎన్నో సినిమాలు, వ్యాపార ప్రకటనల్లో చేస్తు వస్తున్నాను.బాలీవుడ్ లో ఒక దక్షిణాది నటికి అవకాశాలు రావడం చాలా కష్టం.నేను గతంలో హిందీ సినిమా ఆడిషన్ కి వెళ్ళినప్పుడు నీకు హిందీ వచ్చా అని అడిగారు.దాంతో నాకు ఆ అవకాశం పోయింది.కానీ దక్షిణాది పరిశ్రమలో ఇవన్నీ పట్టించుకోరు.ఏ భాషకి చెందిన వారి నైనా ఇక్కడ ఆదరిస్తారు.అందుకే నార్త్ లో చేస్తున్న వాళ్లే ఇక్కడ కూడా హీరోయిన్లుగా చేస్తున్నారని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం రెజీనా'జాట్'అనే హిందీ మూవీలో చేస్తుంది.