English | Telugu

'రెబల్' మూవీ రివ్యూ

మూవీ : రెబల్
నటీనటులు: జీవీ ప్రకాష్ కుమార్, అథిరా, మమితా బైజు, ఆదిత్య భాస్కర్, ‌కరుణాస్,‌ వెంకటేశ్ వి.పి, షాలు‌ రహిమ్
ఎడిటింగ్: వెట్రి‌ కృష్ణన్
మ్యూజిక్: జీ.వీ. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: అరుణ్ కృష్ణ రాధాకృష్ణ
నిర్మాతలు : కె.ఈ. జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం: నికేష్
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

కథ:
మున్నార్ ప్రాంతంలో కొంతమంది కార్మికులు తేయాకుని తెంపుతూ జీవితం సాగిస్తుంటారు. కానీ వారు చేసే పనికి సరైన జీతం లేక కష్టపడుతుంటారు. అయితే వాళ్ళలాగా వాళ్ళు బిడ్డలు కాకూడదని చదివిస్తారు. కతిరేసన్(జీవీ ప్రకాష్ కుమార్), సెల్వ(ఆదిత్య భాస్కర్)కి పాలకాడ్ లో చదువుకోవడానికి సీట్ లభిస్తుంది.‌ ఇక పెట్టాబేడా సర్దుకొని కతిరేసన్, సెల్వతో పాటుగా మరికొంత మంది బిఏ చదువుకోవడానికి వెళ్తారు. అయితే కాలేజీ మొదటి రోజునే వారికి చేదు అనుభవం ఎదురవుతుంది. అదే సమయంలో అక్కడ తమిళియన్లకి లోకల్స్ మధ్య గొడవ జరుగుతుంది. మరి ఈ గొడవలని కొంతమంది రాజకీయం చేస్తుంటారు. ‌అయితే కతిరేసన్, సెల్వలు డిగ్రీ పూర్తిచేసారా? ఆ కాలేజీలో ఏం జరిగిందనేది మిగతా కథ.

విశ్లేషణ:
మునార్ ప్రాంతంలో కొంతమంది కార్మికులు చేసే పని ఒత్తిడిని తగ్గించడానికి వాళ్ళ కొడుకులని చదవించడం, అలా చదివిన వారికి గొప్ప కాలేజీలో సీటు రావడంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఆ తర్వాత కాలేజీలో సీనియర్లు చేసే ర్యాగింగ్ తో కథ మరింత ఉత్కంఠభరితంగా సాగుతుంది. అయితే కాలేజీ హాస్టల్ లో జరిగే గొడవలు బాగానే ఉన్నా.. దానిని రాజకీయం చేయడంతో అది కాస్తా పొలిటికల్ డ్రామాలా సాగుతుంది.

ఈ సినిమా నిడివి రెండు గంటల పదిహేడు నిమిషాలు.. ఇదే కాస్త ఇబ్బంది పెట్టే అంశం. తమిళంలో రెండు వారాల క్రితం రిలీజైన ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి ఐదు భాషల్లో విడుదలైంది. రెండు మూడు ఎమోషనల్ సీన్లు, కాలేజీ ర్యాగింగ్ సీన్లు తప్ప మిగతాదంతా డొల్ల. సెకండాఫ్ అయితే సహనానికి పరీక్ష. ఎంతసేపు పాలిటిక్స్ పాలిటిక్స్ అంటు ఎటువంటి ఎంగేజింగ్ డ్రామా లేకుండా సహనానికి పరీక్ష పెట్టేలా సీన్లు ఉంటాయి. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు ఫ్యామిలితో కలిసి చూసేయొచ్చు. తొంభైల్లో కొంతమంది తమిళియన్లు చదువుకోవడానికి మలయాళీలు ఎక్కువగా ఉండే కాలేజీకి వెళ్ళగా అక్కడ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అయితే ఇంతమంచి కథను సరైన విధంగా తీసుకెళ్ళకుండా మధ్యలో రాజకీయాన్ని మిక్స్ చేసి ఎటో ఎటో తీసుకెళ్ళారు. ఎంటర్‌టైన్మెంట్ లిమిటెడ్ సీన్లకే పరిమితం అన్నట్టుగా సాగదీత సీన్లని చేర్చారు.

ప్రేమలు మూవీ ఫేమ్ మమిత బైజుతో లవ్ సీన్లు పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేవు. అవి కథకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. కథలో మొదటి‌ పదిహేను నిమిషాలు, ఆ తర్వాత కాలేజీలో జరిగే సీనియర్ ర్యాగింగ్ ‌సీన్లు తప్ప ఏదీ పెద్దగా మెప్పించలేదు.

మున్నార్ అందాలని అరుణ్ కృష్ణ రాధాకృష్ణ తన కెమెరాలో బంధించిన కొన్ని సీన్లు ఆకట్టుకుంటాయి. జీ.వీ. ప్రకాష్ కుమార్ అందించిన బిజిఎమ్ పర్వాలేదు. వెట్రి కృష్ణన్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
ఖదిరేషన్ పాత్రలో జీ.వీ. ప్రకాష్ కుమార్ నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. మిగిలిన వారు వారు పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

ఫైనల్ గా..
కథాంశం, కొన్ని ఎమోషనల్ సీన్ల కోసం ఓసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్: 2/5

✍️. దాసరి మల్లేశ్

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.