English | Telugu

'లూటేరే' వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్ : లూటేరే
నటీనటులు: గీతాంజలి గిల్ , అవినాష్ పాండే, క్రిష్ణేంద్ చక్రబొర్తి, మయాంక్ గార్గ్, పవన్ సింగ్,
ముఖేష్ చబ్రా సిఎస్ఏ, జేమ్స్ రియాన్, ఎరమ్ స్టార్స్
కథ : అన్షుమన్ సిన్హా
రచన : విశాల్ కపూర్, సుపర్న్ ఎస్ వర్మ
ఎడిటింగ్: విరాజ్ గడోడియా
సినిమాటోగ్రఫీ: జల్ కోవాస్జి
మ్యూజిక్ : అచింత్ తక్కర్
నిర్మాతలు: శైలేష్ ఆర్ సింగ్
దర్శకత్వం: జై మెహతా
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

కథ:
సోమాలియా దేశానికి అనధికార రాజుగా రాబర్ట్ షా ఉండేవాడు. రాబర్ట్ చనిపోయాక అతని మేనల్లుడు విక్రాంత్ గాంధీ పోర్ట్ ఏరియాతో పాటు సోమాలియాకి నియంతలా ఉన్నాడు. ఇక అదే సమయంలో అతనికి ఉక్రెయిన్ నుండి ఓ షిప్ మెంట్ పెద్ద నౌకలో సముద్రంలో వస్తుంటుంది. మరికొన్ని గంటల్లో అది పోర్ట్ రీచ్ అవుతుందనుకున్న సమయంలో దానిని సోమాలియన్ దొంగలు హైజాక్ చేస్తారు. ఇక ఆ షిప్ కి కెప్టెన్ గా ఏకే సింగ్ ఉంటాడు. అతనితో పాటు మొత్తం పన్నెండు మంది క్రూ షిప్ లో ఉంటారు. అదే సమయంలో విశ్రాంత్ నియంతలా పాలిస్తున్న పోర్ట్ ఏరియాకి ఎలక్షన్స్ రావడంతో అతనికి ఏం చేయాలో తెలియదు. విక్రాంత్ కి వ్యతిరేకంగా యాకుబ్, తౌఫిక్ ఉన్నారని అతను భావిస్తాడు. అదే సమయంలో షిప్ హైజాక్ అవ్వడంతో అతనికి సమస్య మరింత తీవ్రమవుతుంది. ఏకేసింగ్ క్రూ గల ఆ షిప్ ని సముద్రపు దొంగల నుండి విక్రాంత్ కాపాడాడా? అసలు ఆ షిప్ లో ఏం ఉంది? పోర్ట్ ఎలక్షన్స్ లో గెలిచిందెవరు? తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:
మన కలలు నెరవేర్చుకోవడానికి జేబులో డబ్బులు ఉంటే సరిపోదు.. గుండెలో ధైర్యం కూడా ఉండాలి అంటూ విక్రాంత్ చెప్పే మాటలతో ఆసక్తికరంగా మొదలవుతుంది. ‌ఉక్రెయిన్ నుండి వస్తున్న అతిపెద్ద షిప్ ని సోమాలియన్లు హైజాక్ చేయడంతో కథ ఇంటెన్స్ ని క్రియేట్ చేసింది. ఇక హైజాక్ తర్వాత షిప్ లోని క్రూ అండ్ ఆ షిప్ మెంట్ ని తీసుకునే యజమాని పడే పాట్లు నిజంగా ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి.

ఆ షిప్ కెప్టెన్ ఏకే సింగ్ మాటలు, అతను వారి క్రూతో చెప్పే కొన్ని సీన్లు ఎమోషనల్ గా సాగుతాయి ‌ అయితే ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ నిడివి దాదాపు నలభై నిమిషాల వరకు సాగింది. అది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. అసభ్య పదజాలం వాడలేదు. సముద్రపు దొంగ అనే కాన్సెప్ట్ వినగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే పేరు జాక్ స్పారో‌‌. 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ' పేరిట జాక్ స్పారో చేసిన చాలా సినిమాలు హాలివుడ్ సినిమాలని ఇష్టపడే వారికి పరిచయమే.

ఈ వెబ్ సిరీస్ మొత్తంగా నాలుగు ఎపిసోడ్ లు ఉంది. మొదటి ఎపిసోడ్ వెల్ కమ్ టూ సోమాలియా : షిప్ ని హైజాక్ చేసిన సోమాలియన్లు షిప్ కెప్టెన్ తో మాట్లడే మాటలు, చేసే పనులు భయాన్ని తెప్పిస్తాయి. రెండవ ఎపిసోడ్ బిసైజ్డ్ : ఇందులో ఆపదలో ఉన్నప్పుడు ఒక్కొక్కరి స్వభావం ఎలా ఉంటుందో సాగుతుంది. మూడవది హోమ్ స్వీట్ హోమ్ : ఈ ఎపిసోడ్ లో హైజాక్ కి గురి అయిన క్రూ మెంబర్స్ వారి కుటుంబాల గురించి చెప్పుకునే షార్ట్ స్టోరీలు సాధారణ అభిమానికి నచ్చేస్తాయి. నాల్గవది మిడిల్ మ్యాన్ : పెద్ద పెద్ద డీలీంగ్స్, వ్యాపారం చేసేవారికి కొంతమంది నమ్మకస్తులు ఉంటారు. అయితే వారు ఎంత నిజాయితీగా ఉంటారనేది క్లుప్తంగా వివరించారు మేకర్స్.‌

నెమ్మదిగా సాగే కథనం కాస్త ఇబ్బంది పెడుతుంది. స్క్రీన్ ప్లే బాగుంది. అయితే క్యారెక్టర్ల పేర్లని గుర్తుంచుకోవడం కాస్త కష్టమవుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. విరాజ్ గడోడియా ఎడిటింగ్ నీట్ గా ఉంది. జల్ కోవాస్జి సినిమాటోగ్రఫీ బాగుంది.

నటీనటుల‌ పనితీరు:
అవినాష్ పాండే, గీతాంజలి గిల్, మాయాంక్ గార్గ్, పవన్ సింగ్ పాత్రలు ఈ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచాయి. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా..
భిన్నమైన కథని ఇష్టపడే వారికి ఈ షిప్ హైజాక్ నచ్చేస్తుంది. కామన్ ఆడియన్స్ ఓ సారి ట్రై చేయొచ్చు.

రేటింగ్: 2.5/5

✍️. దాసరి మల్లేష్

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.