English | Telugu

ట్విస్ట్ ఇచ్చిన కళ్యాణ్.. రవితేజ ఏం చేయబోతున్నాడు..?

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆగస్టు 27న 'మాస్ జాతర'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాగే కిషోర్ తిరుమల డైరెక్షన్ లో చేస్తున్న ప్రాజెక్ట్.. 2026 సంక్రాంతికి విడుదల కానుంది. త్వరలో మరో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాడు.

'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో కామెడీ డైరెక్టర్ గా మంచి పేరు పొందిన కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నాడు. మ్యాడ్ చిత్రాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఇది రూపొందనుందని తెలుస్తోంది. రవితేజ 'మాస్ జాతర' సైతం సితార బ్యానర్ లోనే రూపొందుతుండటం విశేషం.

రవితేజ, కళ్యాణ్ శంకర్ చేతులు కలిపితే.. అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ అయ్యుంటుందని అందరూ భావిస్తారు. అయితే ఈ మూవీ సోషియో ఫాంటసీ జానర్ లో ఉంటుందట. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందని తెలుస్తోంది. డిసెంబర్ నుంచి షూట్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ను లాక్ చేసినట్లు సమాచారం.

సోషియో ఫాంటసీ జానర్ అంటే వీఎఫ్ఎక్స్ తో ముడిపడి ఉంటుంది. దాంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం పడుతుంది. మామూలుగా రవితేజ సినిమాలు వేగంగా పూర్తవుతుంటాయి. మరి ఈ చిత్రం ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.