English | Telugu

అప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి..ఇప్పుడు రాజమౌళి..గుణశేఖర్

రుద్రమదేవి సినిమా హిట్ కావడంతో.. సక్సెస్ మీట్ లో గుణశేఖర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ''ప్రకాష్ రాజు గారు ఈ సినిమా నేను మొదలుపెట్టిన తరువాత నాలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ చేసారు. ఆయన మాటలు నాలో చాలా ఉత్తేజాన్ని కలిగించాయి. అనుష్క లేకపోతే రుద్రమదేవి లేదు. మాతో పాటు మూడు సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉంది. తన స్త్రెంగ్థ్ చూసి నాకు ఆశ్చర్యమేసేది. రుద్రదేవుడు, రుద్రమదేవి అనే రెండు పాత్రల్లో తను చూపించిన వేరియేషన్ అధ్బుతం. గోనగన్నారెడ్డి పాత్ర కోసం చాలా స్ట్రగుల్ అయ్యాం. చివరికి అల్లు అర్జున్ ఆ పాత్ర పోషించారు. తను స్క్రీన్ పై ఉన్న యాబై నిమిషాల్లో ప్రతి నిమిషం ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. నా కెరీర్ లో ఒక పాత్రకు ఇంత అప్లాజ్ రావడం మొదటిసారి చూస్తున్నాను. ఇలాంటి కథలను సినిమాగా స్టూడియో అధికారులో, బడా నిర్మాతలు మాత్రమే చేయగలరు. నేను సినిమా చేయడానికి చాలా మంది చాలా రకాలుగా సహకరించారు. అల్లు అరవింద్, దిల్ రాజు, అనుష్క, రానా ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని అందించారు. ఈ సినిమా చూసిన వారందరూ నాకు కంగ్రాట్స్ చెప్పకుండా.. థాంక్స్ చెబుతున్నారు. గొప్ప చరిత్రను తెలుగువాడు తీసినందుకు గర్వంగా ఉందని అందరూ చెబుతున్నారు. కొత్త చిత్రాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాజమౌళి ఇప్పుడు నేను ఇలాంటి చిత్రాలు తీయడం మొదలు పెట్టాం. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను''.. అని చెప్పారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.