English | Telugu

రాశీఖన్నా "సుప్రీమ్" సూపర్ లుక్స్


చిట్టిపొట్టి డ్రస్స్ లతో అలరించిన రాశీఖన్నా ఇప్పుడు పూర్తి భిన్నంగా సరికొత్తగా పోలీస్ అవతారమెత్తనుంది. సాయిధమ్ తేజ్ హీరోగా, రాశీఖన్నా హీరోయిన్ గా, పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుప్రీమ్ అనే సినిమా తెరకెక్కబోతుంది. అయితే ఈసినిమాలో రాశీఖన్నా పోలీసు పాత్రలో నటించనుంది. అయితే ఇప్పుడు రాశీఖన్నాకు ఈ పోలీసు డ్రస్ బాగా నచ్చిందట. అందుకే తను సెట్ లోకి వెళ్లిన మొదటి రోజే పోలీసు డ్రస్ వేసుకొని ఉన్న ఫోటోలని ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి తెగ సంబరపడిపోతుందట ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ పోలీసు డ్రస్స్ లో కూడా రాశీఖన్నా అందం ఏమాత్రం తగ్గలేదు కదా.. ఇంకా ఆ టైట్ డ్రస్ లో ఆమె ఇంకా అందంగా కనిపిస్తుందంటూ చిత్ర యూనిట్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రాశీఖన్నా యాక్షన్ సన్నివేశాలు కూడా చేస్తుందట. ఈ సినిమాతో ఫల్ కాన్ఫిడెన్స్ గా ఉన్న రాశీఖన్నా.. దీనివల్ల రీసెంట్ గా వచ్చిన "శివమ్" ప్లాప్ అయినా కూడా తను తొందరగా కోలుకున్నట్టు తెలుస్తోంది. ఇక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం విజయంతో సాయిథరమ్ తేజ్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. మరి ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్న రాశీఖన్నాకు ఎలాంటి ఫలితం ఉంటుందో సినిమా వస్తే కాని చెప్పలేం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.