English | Telugu

రకుల్ ప్రీత్ సింగ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందా?

యంగ్ హీరోల సరసన వరుస ఆఫర్లు కొట్టేస్తూ ఫల్ జోష్ మీద ఉంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఇప్పుడు ఈ భామ ఎమ్మెల్యేగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుంది. నిజంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందనుకుంటున్నారా.. అలా అయితే తప్పులో కాలేసినట్టే. నిజ జీవితంలో పొలిటికల్ ఎంట్రీ కాదు.. సినిమాలో ఎమ్మెల్యేగా గా నటించనుంది. అసలు విషయం ఏంటంటే.. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో "సరైనోడు" సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ఈ సినిమాలో రకుల్ ఓ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా పాత్ర పోషించనుంది. అయితే ఈ పాత్రకు తగ్గ వయసుకాకపోయినప్పటికీ.. ఈ పాత్ర చాలా ఛాలెంజింగ్ గా ఉండటంతో తనలోని అందంతో పాటు అభినయాన్ని చూపించుకోవడానికి ఆస్కారం ఉన్న క్యారెక్టర్ అని భావించి ఈ రోల్ ప్లే చేయడానికి రకుల్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రకుల్ చేతిలో భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. ఇప్పటికే రాంచరణ్, రకుల్ నటించిన "బ్రూస్ లీ" చిత్రం ఈ నెలలోనే రిలీజ్ కు సిద్దమయింది. ఇంకా ఎన్టీఆర్ సరసన "నాన్నకు ప్రేమతో" సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పుడు అల్లు అర్జున్ తో "సరైనోడు" సినిమాలో నటిస్తుంది. ఇంకా చాలా ఆఫర్లు రకుల్ తలుపు తడుతున్నాయి. మొత్తానికి టాలీవుడ్ లో రకుల్ హవా నడుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదనిపిస్తుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.