English | Telugu
కంచెకు మెగా సపోర్ట్ లేదా??
Updated : Oct 21, 2015
సాయిధరమ్ తేజ్, వరుణ్‌తేజ్ సినిమాలకు ప్లస్ పాయింట్.. మెగా ఫ్యాన్స్. సాయి సినిమాలు తొలి రోజు నుంచే వసూళ్లు రాబట్టుకొంటున్నాయంటే, టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వస్తున్నాయంటే.. అదంతా మెగా ఫ్యాన్స్ అండదండలే. మిగిలిన మెగా హీరోలు కూడా ఆయా సినిమాల్ని వీలైనంత వరకూ ప్రమోట్ చేస్తున్నారు.
అయితే.. కంచెకు మాత్రం మెగా హీరోల సపోర్ట్ కనిపించే అవకాశాల్లేవు. ఎందుకంటే.. బ్రూస్లీ వచ్చిన వారానికే ఈసినిమా వచ్చేస్తోంది. బ్రూస్లీ బరిలో ఉన్నప్పుడు కంచెని విడుదల చేయడం పట్ల చిరు కాస్త ఇబ్బందికి గురయ్యాడని, నాగబాబుపై గుర్రుగా ఉన్నాడని తెలుస్తోంది. `నా చేతుల్లో ఏమీ లేదు అన్నయ్యా..` అంటూ నాగబాబు చిరంజీవికి సంజాయిషీ కూడా చెప్పుకొన్నాడని టాక్.
కంచె సినిమా ఆడియోకి వచ్చిన రామ్ చరణ్ కూడా... కంచె ప్రమోషన్‌ని లైట్ తీసుకొన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ చరణ్ మాట్లాడిందే లేదు. ఇక మీదటా అదే పరిస్థితి కనిపించొచ్చు. ఈ సినిమా విజయం మౌత్ టాక్‌పైనే ఆధారపడి ఉందన్న సంగతి కంచె టీమ్‌కీ తెలుసు. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయితే అదే చాలన్నట్టుంది నాగబాబు పరిస్థితి. చూద్దాం.. మోగా హీరోల సపోర్ట్ లేకుండా కంచె ఏమాత్రం గట్టెక్కుతుందో??