English | Telugu

మెగా ప్రిన్సెస్ తో మెగా దంపతులు.. పేరు కూడా పెట్టేశారు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. జూన్ 20న హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలోనూ, మెగా అభిమానుల్లోనూ సంతోషం నెలకొంది. తాజాగా ఆసుపత్రి వద్ద పాపతో మీడియా కంటపడ్డారు మెగా దంపతులు. అంతేకాదు పాపకు ముందే పేరు కూడా పెట్టేశారట.

ఈరోజు ఉపాసనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. పాపను ఎత్తుకొని ఉపాసనతో కలిసి చరణ్ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాపను ఎత్తుకొని మెగా దంపతులు చిరునవ్వుతో ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న వీడియో చూడముచ్చటగా ఉంది. ఈ సందర్భంగా చరణ్ మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు. "ఉపాసన, పాప ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. పాప లేదా బాబు ఎవరు పుట్టినా ఏం పేరు పెట్టాలని ఉపాసన, నేను ముందే నిర్ణయించుకున్నాం. అయితే పేరు ఏంటనేది ఇప్పుడే చెప్పలేను. సాంప్రదాయం ప్రకారం 21వ రోజు పేరు పెడతారు కదా, ఆ రోజు స్వయంగా నేనే మీ అందరికీ పేరు రివీల్ చేస్తాను" చరణ్ అన్నారు.