English | Telugu

రామ్-బోయపాటి మూవీ రిలీట్ డేట్ మారింది!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రామ్, బోయపాటి మొదటిసారి చేతులు కలిపిన ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ మారింది.

ఈ సినిమాని చెప్పిన తేదీ కంటే ముందుగానే సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. పచ్చని పొలాల్లో పంచె కట్టుతో నులక మంచం మీద కూర్చొని ఉన్న రామ్ లుక్ ఆకట్టుకుంటోంది. మాస్ సినిమా నుంచి విడుదలైన ఈ క్లాస్ పోస్టర్ సర్ ప్రైజ్ చేస్తోంది.

రామ్-బోయపాటి మూవీ ప్రీపోన్ అయ్యే అవకాశముందని గతంలో వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్లుగానే సినిమా విడుదల తేదీ ముందుకు జరిగింది. సినిమాని ప్రీపోన్ చేయాలనే ఆలోచన మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 20 సమయంలో 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు', 'లియో' వంటి బడా సినిమాలు ఉన్నాయి. వాటి కారణంగా ఈ మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. సెప్టెంబర్ 15 సమయంలో బడా సినిమాల తాకిడి లేదు. పైగా ఐదో రోజైన సెప్టెంబర్ 19 న వినాయక చవితి హాలిడే కూడా కలిసిరానుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.