English | Telugu

పొల్లాచ్చిలో చరణ్ కాజల్ రొమాన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం పొల్లాచిలో జరుగుతుంది. చరణ్, కాజల్ అగర్వాల్ పై ఒక పాటని చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ ఇలాంటి హాట్ హాట్ రొమాంటిక్ సాంగ్ లను చిత్రీకరించడంలో దిట్ట. కాబట్టి ఈ పాట చిత్రీకరణ అధ్బుతంగా వస్తుందని చిత్ర యూనిట్ అంటున్నారు. పొల్లాచిలోనే ఈ నెల 26వరకు షూటింగ్ జరిగే అవకాశం ఉంది. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.