English | Telugu

హీరోయిన్ దర్శకుడి మధ్య చాడీలు

"సరదాగా కాసేపు", "షాడో" వంటి పలు చిత్రాలలో నటించిన హీరోయిన్ మధురిమకు ఓ తమిళ సినిమా దర్శకుడి వలన నిందలు వచ్చాయి. ప్రస్తుతం మధురిమ "సేరెందు పోలమా" అనే తమిళ చిత్రంలో నటిస్తుంది. అయితే ఇటీవలే ఈ చిత్ర దర్శకుడు అనిల్ ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... "మధురిమ ఎప్పుడూ సెట్ కు చాలా ఆలస్యంగా వస్తుందని, దాని కారణంగా షూటింగ్ ఆలస్యం అవడమే కాకుండా బోలెడంత డబ్బు కూడా నష్టమని తెలిపాడు. ఈమెకోసం కొన్నిసార్లు చిత్ర యూనిట్ మొత్తం వేచి ఉన్నప్పటికీ.. తనకేం సంబంధం లేనట్లుగా ఉండేది" అని అన్నారు.

దర్శకుడు ఇలా మాట్లాడేసరికి ఈ విషయం తెలుసుకున్న మధురిమ స్పందిస్తూ... “విదేశాలలో షూటింగ్ కు వచ్చే ముందు నాకు 10శాతం రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. అంతేకాక వీళ్ళు చేసిన పనుల వలన మా అమ్మ వీసా సమయానికి అందలేక మొదటిసారిగా నేను ఒక్కదానినే విదేశాలకు రావలిసి వచ్చింది. ఇదేంటని అడగబోతే నాపైనే లేనిపోని నిందలు వేస్తున్నారని” తెలిపింది.

మరి ఈ ఇద్దరు చెప్పినదాంట్లో ఎవరిది ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇక్కడ నష్టం మాత్రం మధురిమకే అని తెలిసిపోతుంది. అసలే అవకాశాలు రాక అల్లాడిపోతున్న ఇలాంటి సమయంలో ఇలా నిందలు వస్తే... భవిష్యత్తులో అవకాశాలు ఎలా వస్తాయో చూడాలి మరి.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.