English | Telugu

వాళ్లందరి నోరు మూయించిన కాజల్ అగర్వాల్

వరుస హిట్లతో దూసుకుపోతూ టాలీవుడ్ లో టాప్ ప్లేస్ సంపాదించుకున్న కాజల్ ఆగర్వాల్ గత కొద్దికాలంగా తన దూకుడిని తగ్గించిందనే చెప్పాలి. ఎన్టీఆర్ తో టెంపర్ చిత్రంలో నటించిన ఈ చందమామ ఆతర్వాత కనిపించలేదు. దీంతో కాజల్ ఆగర్వాల్ పనైపోయింది.. ఇంకా ఆఫర్లు రావడం కష్టమని అందరూ గుసగుసలాడుకున్నారు. కానీ వారందరి నోళ్లు మూయించి ఇప్పుడు పలు ప్రాజెక్టులతో బిజీ అయిపోవడానికి సిద్దంగా ఉంది ఈమిత్రవింద. ప్రస్త్తుతం పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుంది. ఇది కాకుండా ఇంకా కోలీవుడ్ పలు చిత్రాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించిన కాజల్ ఇప్పుడు జీవా హీరోగా నటిస్తున్న 'కావలై వేండామ్' అనే సినిమాలో లీడ్ రోల్ కి ఎంపికైంది కాజల్... దీంతో పాటు విక్రమ్ తో నటించే అవకాశం కొట్టేసింది. విక్రమ్ హీరోగా, ఆనంద్ శంకర్ దర్శకుడిగా తెరకెక్కనున్న ‘మర్మ మనిదన్’ అనే సినిమాలో సోలో హీరోయిన్ సెలక్టయింది. ఇంకా లారెన్స్ డైరెక్షన్ లో రాబోతున్న మొట్టు శివ కెట్ట శివ లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది కాజల్. మొత్తానికి కాజల్ జోరు చూస్తుంటే ఇంకో రెండు మూడేళ్ల వరకూ సౌత్ లో తానే ఏలేలా ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.