English | Telugu

రజనీకాంత్,నాగార్జున కలిసి ఏం చెప్పబోతున్నారు.. లోకేష్ నాగ్ ని కలిసింది నిజం 

సూపర్ స్టార్ రజనీకాంత్( rajini kanth) యువసామ్రాట్ నాగార్జున( nagarjuna)తమ పవర్ ఫుల్ యాక్టింగ్ తో కొన్ని లక్షల మంది అభిమానులని కొన్ని తరాలుగా అలరించుకుంటు వస్తున్నారు. ఆ ఇద్దరు చూడని రికార్డు లేదు. అసలు ఆ రెండు పేర్లు పక్క పక్కన వింటేనే ఒక కొత్త రకమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి. అలాంటిది ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే. ఆల్ ఓవర్ ఇండియా షేక్ అయిపోదు. ప్రస్తుత సినీ వాతావరణాన్ని చూస్తుంటే అందుకు ముహూర్తం దగ్గర పడేలా ఉంది.


రజనీ ప్రస్తుతం వెట్టియాన్ అనే మూవీ చేస్తున్నాడు. కంటిన్యూ షెడ్యూల్స్ తో శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj)తో మూవీకి కమిట్ అయ్యాడు. ఇప్పుడు ఈ మూవీలో నాగార్జున కూడా నటించబోతున్నాడనే వార్తలు వినపడుతున్నాయి.మన తెలుగు నాట అధికారప్రకటన రాకపోయినప్పటికీ తమిళనాడులో మాత్రం నాగ్ ,రజనీ కాంబో స్క్రీన్ మీద మెరవడం ఖాయమనే చర్చ నడుస్తుంది. పైగా లోకేష్ ఇటీవలే నాగార్జునని ని కూడా కలిసాడు.ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఆ న్యూస్ చూసిన ఇరువురి ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ ఎలా ఉంటుందో అనే చర్చ కూడా మొదలయ్యింది.

లోకేష్ ఇటీవలే విజయ్ (vijay) తో లియో తీసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. రజనీ జైలర్ విజయంతో మంచి ఊపు మీద ఉన్నాడు. నాగార్జున నా సామి రంగ తో ఫామ్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు కలయికలో సినిమా రావడం ప్రేక్షకుల అదృష్టమే అని చెప్పాలి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంతవరకు ఎవరు టచ్ చెయ్యని పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. కమల్ హాసన్ కూతురు ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ రజనీకి కూతురుగా నటిస్తుండటం విశేషం.ఇక అతి తక్కువ వ్యవధిలోనే నాగ్ చెయ్యబోయే మరో భారీ మల్టీస్టారర్ ఇది. ఆల్రెడీ ధనుష్ తో కుబేర చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల దానికి దర్శకుడు

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.