English | Telugu
డైరక్టర్‌ని పిలిచి మెచ్చుకున్న రజనీకాంత్!
Updated : Jul 5, 2023
కొత్తవారిని, కొత్త విషయాలను మెచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు రజనీకాంత్. తమిళనాడులో ఏ సినిమా సక్సెస్ అయినా, టీమ్‌ని ఇంటికి పిలిపించుకుని ప్రశంసించి పెద్దరికాన్ని చాటుకుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు మామన్నన్ డైరక్టర్ మారి సెల్వరాజ్‌ని పిలిపించుకుని మాట్లాడారు. అద్భుతమైన సినిమా అని, తనకు చాలా బాగా నచ్చిందని అన్నారు. సమానత్వం గురించి మారి సెల్వరాజ్ చాలా మంచి సినిమా చేశారు. వడివేలు, ఉదయనిధి స్టాలిన్ నటన అద్భుతంగా ఉంది అని ట్విట్టర్లోనూ పోస్ట్ చేశారు తలైవర్. ఉదయనిధి స్టాలిన్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతోంది మామన్నన్ గురించి. వడివేలు ఇందులో కీ రోల్ చేశారు.
ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటించారు. కీర్తీ సురేష్ హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. రజనీకాంత్ తనను పిలిచి మాట్లాడినందుకు థాంక్స్ చెప్పారు మారి సెల్వరాజ్. ``నేను చేసిన ప్రతి సినిమానూ మెచ్చుకున్నారు రజనీ సార్. నా పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ సినిమాలను కూడా ప్రశంసించారు. ఇప్పుడు మామన్నన్‌కి కూడా పిలిచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. అరుదుగా దక్కే అదృష్టం అది. నా ప్రతి సినిమాకూ ఆయన ఆశీస్సులుండటం ఆనందంగా ఉంది`` అని అన్నారు మారి సెల్వరాజ్. మామన్నన్ కుల వ్యవస్థకు అద్దం పట్టిన సినిమా. ఎ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు మెయిన్ అసెట్ అయింది. లాల్, అళగమ్ పెరుమాళ్, విజయ్ కుమార్, గీతా కైలాసం, రవీనా రవి, రామకృష్ణన్ కీ రోల్స్ చేశారు. రెడ్ జెయింట్స్ బ్యానర్ మీద ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు.