English | Telugu
వరుణ్ నిశ్చితార్థానికి ముందే నిహారిక విడాకులు!
Updated : Jul 5, 2023
మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు కొద్ది నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ లో చైతన్య కనిపించకపోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వరుణ్ నిశ్చితార్థానికి ముందే నిహారిక తన భర్త నుంచి విడిపోయినట్లు తాజాగా క్లారిటీ వచ్చేసింది.
2020 డిసెంబర్ లో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగింది. పెళ్ళయిన మొదటి ఏడాదిన్నర, రెండేళ్ళు వీళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఆ తరువాత ఏవో కారణాల వల్ల వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరు విడిపోతున్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. జూన్ 9న జరిగిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థంలో నిహారిక భర్త చైతన్య కనిపించకపోవడంతో విడాకులపై దాదాపు అందరికి క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా వీరి విడాకుల పిటిషన్, కోర్టు ఆర్డర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏప్రిల్/మే సమయంలో నిహారిక-చైతన్య పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 5 న వీరి విడాకులు మంజూరు అయ్యాయి. అంటే వరుణ్ నిశ్చితార్థానికి ముందే నిహారిక, చైతన్య విడిపోయారన్నమాట.
తాజాగా నిహారిక కూడా సోషల్ మీడియా వేదికగా తన విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. చైతన్య, తాను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని.. తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె ప్రెస్ నోట్ విడుదల చేసింది.