English | Telugu

'శైవం' రీమేక్ లో రాజేంద్రడు

'నాన్న‌' చిత్రంలో ఆత్మీయ నటనను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్న సారా గుర్తుందిగా?.. ఆమె ప్రధాన పాత్రలో 'నాన్న' ఫేం ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శైవం'. తమిళంలో ఆ మధ్యన విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల నుంచి కితాబు అందుకుంది. ఇందులో సారా నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో క్రిష్ డైరక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. 'శైవం' తెలుగు రీమెక్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రను చేస్తున్నట్లు సమాచారం. 'శైవం'లో నాజర్ చేసిన పాత్రను తెలుగులో రాజేంద్రప్రసాద్ చేస్తున్నారట. పస్తుతం ఠాగూర్ సినిమా హిందీ రీమేక్ ‘గబ్బర్’ లో బిజీగా వున్న డైరెక్టర్ క్రిష్..ఆ సినిమా తరువాత దీనిని మొదలుపెడతారని తెలుస్తోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.