English | Telugu
రాజ్ తరుణ్ కు అప్పుడే ఆ హీరోయిన్ కావాలంటా..?
Updated : Jan 28, 2016
వరుసగా మూడు సినిమాలు హ్యాట్రిక్ కొట్టి మంచి జోష్ మీదున్నాడు రాజ్ తరుణ్. ఇక తన కొత్త సినిమా ''సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'' కూడా ఈ శుక్రవారం రిలీజ్ కు సిద్దంగా ఉంది. అలాంటి కుర్ర హీరో ఇప్పుడు సమంత కావాలంటున్నాడంటా.. అ సంగతేంటో ఓ లుక్కేద్దాం.. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు రిలీజవుతున్న సందర్బంగా హీరో రాజ్ తరుణ్ మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా రాజ్ తరుణ్ ను ఓ ప్రశ్న అడిగారంట విలేకరులు. అదేంటంటే.. అందరూ కొత్త హీరోయిన్లతోనే చేస్తున్నారు.. పాపులర్ హీరోయిన్లతో చేయరా అని.. దానికి రాజ్ తరుణ్ మాత్రం వారితో చేసే రేంజ్ ఇంకా మనకు రాలేదులేండి అని చెప్పారంట. ఒకవేళ వారితో నటించే ఛాన్స్ వస్తే ఎవరితో నటిస్తారు అని అడిగితే దానికి.. నాకు సమంత అంటే చాలా ఇష్టం.. తన మీద నాకు విపరీతమైన క్రష్ ఉంది అని చెప్పాడు. మరి ఈ కుర్రహీరో కోరిక తీరుతుందో లేదో..