English | Telugu

రూమర్ కాదు నిజమే.. నానితో మాములుగా ఉండదు

నాచురల్ స్టార్ నాని(Nani),దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్'(The paradise). ఇంతకు ముందు ఈ ఇద్దరు కలిసి 'దసరా'(Dasara)తో హిట్ ని అందుకోవడమే కాకుండా నేషనల్ అవార్డు సైతం సాధించారు. దీంతో 'ది ప్యారడైజ్'పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ తో తెలుగు తెరపై ఇంతవరకు రాని ఒక సరికొత్త కాన్సెప్ట్ తో 'ది ప్యారడైజ్' తెరకెక్కబోతుందనే విషయం అర్ధమవుతుంది.

ఇక ఈ మూవీలో 2023 వ సంవత్సరంలో హిందీ చిత్ర సీమలో సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘కిల్(Kill)'మూవీ ఫేమ్ 'రాఘవ్ జుయల్'(Raghav Juyal)కీలక పాత్రలో చేస్తున్నాడు. ఈ మేరకు మేకర్స్ అధికారంగా ప్రకటిస్తు ఒక వీడియో రిలీజ్ చేశారు. సదరు వీడియోలో రివాల్వర్, కత్తులు, స్టయిలిస్ట్ కళ్ళ జోడుని చూపించడంతో పాటు జుయల్ కి శ్రీకాంత్ తన క్యారక్టర్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. దీంతో సదరు వీడియోలో ఉన్న దాన్ని బట్టి 'ప్యారడైజ్' లో జుయల్' క్యారక్టర్ ఏ స్థాయిలో ఉండబోతుందో అర్ధమవుతుంది. ఈ రోజు జుయల్ పుట్టిన రోజు కావడం విశేషం.

నిజానికి 'ప్యారడైజ్'లో జుయల్ చేయబోతున్నాడనే రూమర్స్ చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులందరూ ఆ వార్త నిజం కావాలని అనుకున్నారు. ఎందుకంటే కిల్ మూవీతో పాటు తన గత చిత్రాల్లో జుయల్ నటన ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. అందుకే పాన్ ఇండియా వ్యాప్తంగా జుయల్ ఓవర్ నైట్ స్టార్ అవ్వడంతో పాటు ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకున్నాడు. దీంతో ప్యారడైజ్ కి పాన్ ఇండియా స్థాయిలో అదనపు క్రేజ్ ఏర్పడిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అనిరుద్ సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న 'ప్యారడైజ్' ని 'దసరా' మూవీని నిర్మించిన సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. త్వరలోనే మిగతా నటీనటుల వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ప్యారడైజ్ మార్చి 26 , 2026 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.