English | Telugu
రభస మొదటి పాట ''మార్ సలాం'' రిలీజ్
Updated : Aug 1, 2014
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రభస ఆడియోలోని మొదటి ''మార్ సలాం'' అనే పాటను బెల్లంకొండ పద్మావతి గారు విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్యశాస్త్రి గారు రాశారు. ఈ సందర్బంగా రామజోగయ్యశాస్త్రి గారు మాట్లాడుతూ.. ఈ పాటను ఎన్టీఆర్ గారికి రాసినందుకు చాలా సంతోషంగా వుంది. ఓక కమర్షియల్ సినిమాలో దేశభక్తి ప్రధానమైన పాటను రాసినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ఎన్టీఆర్ గారికి, బెల్లంకొండగారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆడియోలోని ఐదు పాటలు ఒకదానికి ఒకటి పోటీ పడుతాయని చెప్పారు.