English | Telugu

సంతోష్ శ్రీనివాస్ తిక్కరేగితే రభస


రభస చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఆ సినిమా ఇంకా పూర్తి కాకముందే తన నెక్స్ట్ ప్రాజెక్టు వివరాలు ప్రకటించారు. ‘తిక్కరేగితే' అనే టైటిల్ తో ఆ సినిమా రూపొందించనున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో రూపొందిస్తున్న చిత్రానికి మాస్ అపీల్ వున్న రభస టైటిల్ పెట్టిన సంతోష్ తన తర్వాత సినిమాకు కూడా అలాంటి టైటిలే ఖరారు చేయడంతో ఆ సినిమా కూడా కమర్షియల్ హంగులతో, మాస్ ఎంటర్‌టెయినర్ అవుతుందనే అభిప్రాయం కలుగుతుంది.

ఈ సినిమాలో హీరో, హీరోయిన్, నిర్మాత వంటి ఏ వివరాలు ఆయన ప్రకటించలేదు. ఈ ప్రాజెక్టు గురించిన చర్చలు జరుగుతున్నాయని, తదుపరి వివరాలు మరలా ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ రభస ఆడియో రిలీజు, సినిమా పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.