English | Telugu

రామోజీ ఫిలింసిటీలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల పంచాయితీ!

డిసెంబర్ 6 న విడుదల కానున్న పుష్ప 2(pushpa 2)కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)ఉరఫ్ బన్నీ అభిమానులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో,ప్రేక్షకులు కూడా అంతే ఆశగా ఎదురుచూస్తున్నారు. బన్నీ సరసన రష్మిక జత కడుతుండగా ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ముందుకు వెళ్తున్నాయి.ఇక పుష్ప 2 షూటింగ్ అప్ డేట్ గురించిన న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. అదే టైం లో మరో న్యూస్ కి బీజం కూడా వేసింది.

పుష్ప 2 కొత్త షెడ్యూల్ రీసెంట్ గా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో స్టార్ట్ అయ్యింది. బన్నీ మీద కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. కథకి చాలా కీలకమైన సన్నివేశాలు కావడంతో చిత్ర యూనిట్ చాలా పకడ్బంధీగా తెరకెక్కిస్తోంది. అదే విధంగా ఐదవ తారీకు నుంచి ఫాహద్ ఫాజిల్ జాయిన్ అవ్వబోతున్నాడు. దాంతో బన్నీ, ఫాహద్ కాంబినేషన్ సీన్లు ఒక వారం నుంచి పది రోజుల పాటు జరుగుతాయని చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది.

ఇక ఈ న్యూస్ తో సోషల్ మీడియాలో మరో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ని పవన్ అప్ కమింగ్ మూవీస్ కి చెందిన ప్రొడ్యూసర్స్ కలిశారు. త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటానని పవన్ వాళ్ళకి మాటిచ్చాడు. కాకపోతే ఏ సినిమాకి ముందుగా ప్రిఫర్ ఇస్తాడో తెలియదు గాని హరిహర వీరమల్లు షూటింగ్ గతంలో రామోజీ ఫిలిం సిటీ లోనే జరుపుకుంది.ఒక వేళ పవన్,వీరమల్లుకి డేట్స్ ఇస్తే సినిమాకి కున్న భారీ సెట్టింగ్స్ దృష్ట్యా మళ్ళీ ఆర్ఎఫ్ సి లోనే జరుపుకుంటుంది. అదే జరిగితే పవన్, బన్నీలు కలిసే అవకాశం ఉంటుందనే చర్చని ఇద్దరకీ కంబైన్డ్ గా ఉన్న ఫ్యాన్స్ తెస్తున్నారు. అలా జరిగిన పక్షంలో బయట జరుగుతున్న మెగా, అల్లు వివాదానికి ముగింపు పలికే అవకాశం ఉంది. ఇక రీసెంట్ గా పుట్టిన రోజు జరుపుకున్న పవన్ కి బన్నీ శుభాకాంక్షలు తెలియచేసిన విషయం తెలిసిందే.