English | Telugu
యుద్ధం చెయ్యకుండా సైలెంట్ గా ఉంటారు.. ఏం చెప్పావు పూరి
Updated : May 14, 2025
స్టార్ డైరెక్టర్ గా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన 'పూరిజగన్నాధ్'(Puri Jagannadh)గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా వేదికగా పూరి మ్యూజింగ్స్(Puri Musings)ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పూరి చెప్పే పలు ఆసక్తికర విషయాలకీ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. రీసెంట్ గా స్ట్రాంగ్ పీపుల్, నార్మల్ పీపుల్ కి మధ్య తేడాని చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతు స్ట్రాంగ్ పీపుల్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్ళు ఏ కారణం చేతనైన బాధకి గురయ్యితే గట్టిగా ఏడవరు. అన్యాయం జరిగిందని ఎవరికైనా ఫిర్యాదు చెయ్యడం గాని,వివరణ ఇచ్చుకోవడం గాని చెయ్యరు. డ్రామా, యుద్ధం, ఎవరి అటెన్షన్ కోసమో ఎదురుచూడటం లాంటిది చెయ్యరు. పైగా ఎవరిపైనైనా ద్వేషాన్ని,కోపాన్ని పెట్టుకోరు. ప్రతీకారం తీర్చుకునే ఆలోచన ఉండదు. తనకి జరిగిన అన్యాయాన్ని గుండెల్లోనే పెట్టుకొని కొన్నాళ్ళు అందరకి దూరంగా బతుకుతారు. గతంలో మనుషులని నమ్మినట్టుగా నమ్మరు. పనికిరాని పనుల కోసం, అనవసరమైన మనుషుల కోసం ఎక్కువగా ఆలోచించడం చెయ్యకుండా, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధాలపై కూడా విరక్తి పుట్టవచ్చు. మళ్ళీ ప్రేమించుకోవడానికి, స్నేహం చెయ్యడానికి వందసార్లు ఆలోచిస్తారు. నార్మల్ పీపుల్ ఈ లక్షణాలు నేర్చుకోండని పూరి చెప్పుకొచ్చాడు.
పూరి ప్రస్తుతం 'విజయ్ సేతుపతి'(VIjay Sethupathi)తో తన తదుపరి చిత్రం చెయ్యబోతున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ జులై లేదా, అగస్ట్ లో గాని సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పూరి, ఛార్మికౌర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండగా మిగతా వివరాలన్నీ త్వరలోనే తెలియనున్నాయి.