English | Telugu

పూరి పార్టీలో... మ‌స్త్ మ‌జా!

విలాస‌పురుషుడు పూరి జ‌గ‌న్నాథ్. హైద‌రాబాద్‌లోని పూరి ఆఫీసులో అడుగుపెడితే చాలు... ఆయ‌నెంత ఖ‌రీదైన జీవితం గ‌డుపుతున్నాడో అర్థం అవుతుంది. జీవితాన్ని అనుభవించ‌డంలో గురువు రాంగోపాల్ వ‌ర్మ ల‌క్ష‌ణాల్ని, అల‌వాట్ల‌ని పూర్తిగా పుణికి పుచ్చుకొన్నాడు పూరి. ఇటీవ‌ల జ‌రిగిన పూరి పుట్టిన రోజు వేడుక ఇందుకు నిద‌ర్శ‌నం.

బ‌ర్త్ డే పార్టీ అంటే.. కేక్ క‌ట్ చేయ‌డం, లేదంటే మందు పార్టీ చేసుకోవ‌డం మామూలే. పూరి కూడా ఇలానే పార్టీ చేసుకొంటే కొత్తే ముంది. అందుకే మందు, విందుతో పాటు చిందుని పుర‌మాయించాడు. కొంత‌మంది బెల్లీ డాన్స‌ర్ల‌ను తీసుకొచ్చి... వాళ్లు ఆడుతూ ఉంటే... ఆస్వాదించాడు. టాలీవుడ్‌కి చెందిన కొంద‌రు క‌థానాయిక‌లు కూడా పూరి పార్టీలో డాన్స్ చేస్తూ ఉల్లాసంగా గ‌డిపార‌ని టాక్‌. ఈ పార్టీకి చెందిన ఓ వీడియో ఇప్పుడు నెట్ ప్ర‌పంచంలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

పూరి పార్టీలో బెల్లీ డాన్సుల హంగామా, వీటి మ‌ధ్య‌ మందు కొడుతూ, పొగ పీలుస్తూ.. ఆస్వాదిస్తున్న రాంగోపాల్ వ‌ర్మ వీడియో ఒక‌టి.... చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ పార్టీకోసం పూరి దాదాపుగా రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టాడ‌ని టాక్‌. టాలీవుడ్‌లో పూరికి ఆప్త మిత్రులు, కొంత‌మంది హీరోయిన్లు, వ‌ర్మ శిష్యులూ ఈ పార్టీలో పాల్గొన్నార‌ని, తెల్ల‌వార్లూ ఎంజాయ్ చేశార‌ని టాక్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .