English | Telugu

'రణస్థలి' ట్రైలర్ చూస్తుంటే 'ఇంద్ర' సినిమా గుర్తుకొస్తుంది

సూరెడ్డి విష్ణు సమర్పణలో ఎ.జె ప్రొడక్షన్ పతాకంపై పరశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం 'రణస్థలి'. హీరోహీరోయిన్లుగా ధర్మ, అమ్ము అభిరామి, చాందిని రావు నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 26న విడుదలకు సిద్దమైన ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, హీరోలు ఆకాష్ పూరి, నందుతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

అశ్వనీదత్ మాట్లాడుతూ.. "విజయ పిక్చర్స్ అధినేత వెంకటరత్నం గారు ఆ సంస్థను చాలా సక్సెస్ ఫుల్ గా 50 సంవత్సరాలు నడిపిన గౌరవ ప్రదమైన వ్యక్తి. అయన మాకు గురుతుల్యులు వంటి వారు. వారి అబ్బాయి విష్ణు సినిమా రంగంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. 'రణస్థలం' సినిమా ట్రైలర్, టీజర్ లలోని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఇంద్ర సినిమా గుర్తుకొస్తుంది. ఇందులో కొన్ని సీన్స్ చూసిన తరువాత షాకింగ్ గా అనిపించింది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ సినిమాతో మొదలు పెట్టిన విష్ణు వెనుతిరిగి చూడకుండా ఏకాదాటిగా 50 సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకురావాలని కోరుతూ టీం అందరికీ అల్ ద బెస్ట్" అన్నారు.

వీడియో బైట్ ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. "ఇండస్ట్రీకి పరశురాం శ్రీనివాస్ లాంటి కొత్త డైరెక్టర్ రావడం చాలా సంతోషంగా ఉంది. 'రణస్థలి' సినిమా చూసిన వారంతా చాలా బాగుంది అంటున్నారు. ఈ నెల 26 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అయ్యి.. టీం అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా బాగుంది. అంతా కొత్త వారిని పెట్టుకొని దర్శక, నిర్మాతలు అద్భుతంగా తీశారు. ఈ సినిమా చూశాను నాకు బాగా నచ్చింది. ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చి మంచి ప్రమోషన్ చేస్తే బిగ్ హిట్ అవుతుందని భావించి వారికి సపోర్ట్ గా నిలిచాను. నా సొంత సినిమాకు కూడా ఇంత ఎమోషన్ గా మాట్లాడలేదు. ఈ సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది" అన్నారు.

హీరో నందు మాట్లాడుతూ.. "ట్రైలర్, విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది. సినిమా చూసిన వారంతా చాలా బాగుంది అన్నారు. ఈ సినిమా విడుదల అయిన తరువాత బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తీసే దర్శకుడు పరశురాం ఈ సినిమా తర్వాత గొప్ప దర్శకుడు అవుతాడు. ఈ నెల 26 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి" అన్నారు.

చిత్ర నిర్మాతలు విష్ణు, జ్యోతి మాట్లాడుతూ.. "డిఫరెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రణస్థలి సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే అయినా వారంతా అద్భుతంగా నటించారు. ప్రతి క్యారెక్టర్ లో కూడా క్యారెక్టర్ కనిపిస్తుంది తప్ప ఆర్టిస్టులు కనిపించరు. సినిమా చూసి బయటికి వచ్చిన తరువాత వారి క్యారెక్టర్ లు మీతోనే ఉంటాయి. ఈ నెల 26 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము" అన్నారు.

చిత్ర దర్శకుడు పరశురాం శ్రీనివాస్ మాట్లాడుతూ.. "పూరి గారు నాకు గురువు. ఆయనే నా ఇన్స్పిరేషన్. నిర్మాతలు ఈ సినిమా క్వాలిటీ కొరకు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు. రొటీన్ గా వచ్చే కథలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కొరకు నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఈ నెల 26 న వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది" అన్నారు.

చిత్ర హీరో ధర్మ మాట్లాడుతూ.. "ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి కారణమైన దర్శకులు పరుశరాం గారికి థాంక్స్ చెపుతున్నాను. ఈ సినిమా కొరకు దర్శక, నిర్మాతలు చాలా కష్టపడ్డారు. అలాగే జ్యోతి గారు మమ్మల్ని తమ సొంత బిడ్డల్లాగ చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి మంచి సినిమాలో హీరో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు" అన్నారు.

చిత్ర హీరోయిన్ చాందిని మాట్లాడుతూ.. "నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్ చెపుతున్నాను. మా సినిమా ట్రైలర్, టీజర్ అందరికీ నచ్చినట్టే సినిమా కూడా అందరికీ తప్పకుండా నచ్చుతుంది" అన్నారు.

మరో హీరోయిన్ అభిరామి మాట్లాడుతూ.. "ఇందులో నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నాకే గూస్ బమ్స్ వస్తున్నాయి.ఈ సినిమా కొరకు నేను చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు" అన్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.