English | Telugu

హ్యాండ్సమ్ హీరోకి అక్కగా ప్రియాంక చోప్రా


బాలీవుడ్ యంగ్ హీరో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రన్వీర్ సింగ్ తో ఏ హీరోయిన్ అయినా రొమాన్స్ చేయాలనుకుంటుంది. రన్వీర్ పక్కన హీరోయిన్లుగా నటించడానికి బాలీవుడ్ టాప్ భామల మధ్య పోటీ కూడా సహజం. కానీ ఇందుకు భిన్నంగా ప్రియాంక రన్వీర్ కు సోదరిగా నటించడానికి ఒప్పుకుంది.

'దిల్ ధడక్‌నే దో' టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా గురించిన వివరాలు చాలా గోప్యంగా వుంచుతున్నారు. రన్వీర్ సరసన అనుష్క శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రియాంకకు భర్తగా రాహుల్ బోస్ కనిపించనున్నాడు. ఈ మధ్యే ప్రియాంక, రన్వీర్ కలిసి నటించిన చిత్రం 'గుండే'. అందులో హీరోహీరోయిన్ గా నటించిన వీరు ఇందులో బ్రదర్ అండ్ సిస్టర్ గా కనిపించనున్నారు.

ఇక ఈ సినిమాలో రన్వీర్, ప్రియాంకలకు తండ్రిగా నిన్నటి తరం టాప్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నారు. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమె సోదరుడు ఫర్హాన్ అక్తర్ కూడా నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రం తెరపై చూడాలంటే 2015 వరకూ వెయిట్ చేయాల్సిందే. కానీ ఈ సినిమా లుక్ అండ్ ఫీల్ ఎలా వుంటుందో తెలుసుకోవడానికి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ పోస్టర్ చూడవచ్చు.




టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.