English | Telugu

క్రేజీ డైరెక్టర్.. ముగ్గురు హీరోల మల్టీస్టారర్!


నిదానంగా తెలుగులో మల్టీస్టారర్ల ట్రెండ్ మొదలవుతుందండోయ్. ఆల్రెడీ... బాలయ్య, మహేశ్ సినిమా కన్ ఫాం అయ్యింది. ఇంతలోనే... తారక్, చర్రీ కాంబినేషన్లో రాజమౌళి సినిమా వార్త బయటకొచ్చేసింది. ప్రస్తుతం ఏ సినిమా సర్కిల్ లో చూసినా... ఈ రెండు సినిమాల గోలే. వీటితో పాటు మధ్యలో పానకంలో పుడకలా.. మరో మల్టీస్టారర్ కూడా రెడీ అవ్వబోతోంది.. అయితే.. వీళ్లు మరీ అంత పెద్ద స్టార్లు కాదు లేండి. ఇమేజ్ ఉన్న హీరోలే. వారే... నితిన్, రానా, నారా రోహిత్. వీరు ముగ్గురూ త్వరలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. వీరి ముగ్గరినీ కలుపుతున్న దర్శకుడెవరో తెలుసా? ‘గరుడ వేగ’ తో భారీ విజయాన్ని అందుకున్న ప్రవీణ్ సత్తార్. ఇప్పటికే నితిన్ తో తాను ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు ప్రవీణ్. అలాగే నితిన్ కూడా ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో నటిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.

అయితే... ప్రవీణ్ తయారుచేసుకున్న కథలో మరో ఇద్దరు హీరోలకు కూడా స్థానం ఉంది. అందుకే... రానా ను కూడా కలిశాడట . 1945, మహరాజా ఆఫ్ ట్రవంకోర్ చిత్రాలతో పాటు బాలీవుడ్ చిత్రం ‘హాథీ మేరా సాథీ’ సినిమాలతో బిజీగా ఉన్న రానా... ప్రవీణ్ చెప్పిన కథ విని.. ఉద్వేగానికి లోనయ్యాడట. దాంతో రానా కూడా ఇందులో నటించడం దాదాపు ఖరారైపోయింది. దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న రానా.. ఈ సినిమాలో నటించడం మార్కెట్ పై మంచి ప్రభావమే చూపుతుందనడంలో సందేహం లేదు. మూడో హీరోగా నారా రోహిత్ కూడా ఖరారైపోయాడట. విశేషం ఏంటేంటే... నితిన్ ని మినహాయిస్తే... రానా, నారా రోహిత్, ప్రవీణ్ సత్తార్ ముగ్గురూ మల్టీస్టారర్లకు పనిచేసిన వారే. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ లోనే ప్రవీణ్.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.