English | Telugu

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ఏకంగా 18 దేశాల్లో షూట్!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' సినిమాతో బిజీగా ఉన్నాడు. దీనిని పూర్తి చేసి త్వరలోనే బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2' షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఆ మూవీ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి, వచ్చే వేసవి నుంచి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఇది 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలను తలదన్నేలా ఉంటుందట.

ఎన్టీఆర్ అంటే ప్రశాంత్ నీల్ కి ప్రత్యేక అభిమానం. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని తన డ్రీమ్ హీరోతో చేయబోతున్నట్లు ఎన్టీఆర్ సినిమా గురించి గతంలో నీల్ చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే అత్యంత భారీ స్థాయిలో చిత్రాన్ని రూపొందించబోతున్నాడట. ఈ మూవీ కథ ప్రశాంత్ నీల్ గత చిత్రాలకు భిన్నంగా, ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటుందట. అంతేకాదు చిత్రీకరణ కూడా మొత్తం విదేశాల్లోనే ఉంటుందట. ఏకంగా 18 దేశాల్లో షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం విదేశాల్లోనే షూటింగ్ అంటే 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలకు భిన్నంగా సరికొత్త కథతో రూపొందబోతుందని అర్థమవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీగా దీనిని మలచబోతున్నారట. 'ఆర్ఆర్ఆర్'తో ఇప్పటికే ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ లెక్కన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర అసలుసిసలైన వసూళ్ల సునామీని సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' చేస్తున్నాడు. ఇది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు నీల్. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.'సలార్', 'దేవర' సినిమాలు హిట్ అయితే ఈ అంచనాలు ఆకాశాన్నంటుతాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.