English | Telugu

హీరోయిన్ కి శారీ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్.. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడా?

ప్రజెంట్ ఇండియన్ స్టార్స్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ అంటే మొదట గుర్తుకొచ్చే పేరు ప్రభాస్(Prabhas). ఆయన పెళ్లి కోసం అభిమానులు వేయి కళ్ళతో చూస్తున్నారు. త్వరలో ప్రభాస్ పెళ్లి అంటూ గతంలో పలుసార్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, అవేవీ నిజం కాలేదు. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ తో ప్రభాస్ లవ్ లో ఉన్నాడా? అనే చర్చ జరుగుతోంది.

2026 సంక్రాంతికి 'ది రాజా సాబ్'(The Raja Saab)తో ప్రేక్షకులను పలకరించనున్నాడు ప్రభాస్. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటించారు. అయితే వీరిలో రిద్ధి కుమార్ కి ప్రభాస్ శారీ గిఫ్ట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా రిద్ధి కుమార్ రివీల్ చేయడం విశేషం.

తాజాగా 'రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో పాల్గొన్న రిద్ధి కుమార్(Riddhi Kumar).. మొదట మాట్లాడి, మళ్ళీ అందరికీ థాంక్స్ చెప్పడం మర్చిపోయాను అంటూ మరోసారి మైక్ అందుకుంది.

"మొదటగా ప్రభాస్ కి థాంక్యూ సో మచ్. నీ వల్లే ఇక్కడ ఉన్నాను. నీ వల్లే సినిమాలో భాగమయ్యాను. నువ్విచ్చిన చీరనే కట్టుకొని వచ్చాను. ఈ ఈవెంట్ లో ధరించడం కోసమే దీనిని మూడేళ్ళుగా దాచుకున్నాను. నువ్వు నా జీవితంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను" అని రిద్ధి కుమార్ చెప్పింది.

రిద్ధి మాట్లాడుతున్న సమయంలో ప్రభాస్ చిరునవ్వుతో కనిపించాడు. ఇక ఆ వెంటనే యాంకర్ సుమ మైక్ అందుకొని "ప్రభాస్ గారు పండక్కి నాక్కూడా ఒక చీర.. వెయిటింగ్ ఇక్కడ" అనడంతో ప్రభాస్ గట్టిగా నవ్వేశాడు.

'రాజా సాబ్' ప్రీ రిలీజ్ లో రిద్ధి స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ఇలా ఓ హీరోయిన్ కి శారీ గిఫ్ట్ ఇచ్చిన సందర్భాలు ఎప్పుడూ విన్నట్టు లేదు. పైగా "నువ్వు నా జీవితంలో ఉండటం అదృష్టం" అని రిద్ధి చెప్పడం.. ఫ్యాన్స్ లో కొత్త చర్చకు దారితీసింది. ప్రభాస్, రిద్ధి లవ్ లో ఉన్నారా? త్వరలో పెళ్లి చేసుకుంటారా? అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి.

అయితే 'ఆదిపురుష్' సినిమా సమయంలో కూడా కృతి సనన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ, అవి నిజం కాదని తేలిపోయింది. మరి ఇప్పుడు రిద్ధి కుమార్ విషయంలో కూడా అలాగే జరుగుతుందా? లేక ఏదైనా ట్విస్ట్ ఉంటుందా? అనేది త్వరలో తేలిపోనుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.