English | Telugu

ప్రభాస్ డార్లింగ్ తెలుగురాష్ట్రాల వరదబాధితులకి ఎంత అమౌంట్ ఇచ్చాడో తెలుసా!

కొన్నిరోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎంతగానో విలవిలలాడుతున్నాయి. చాలా మంది మంది తినడటానికి తిండి లేక విలవిలలాడుతున్నారు. కొంత మంది అయితే ఇల్లుని కూడా కోల్పోయి ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితి. ఇదంతా గమనిస్తున్న పలువురు సినిమా హీరోలు మేమున్నాం అంటూ ముందుకొచ్చి భారీ విరాళాలని అందిస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోనే ప్రభాస్ (prabhas)చేసిన భారీ సాయం టాక్ అఫ్ ది డే గా నిలిచింది.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి రెండు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రభాస్ ప్రకటించాడు. దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన అందరి హీరోల కంటే ప్రభాస్ నే ఎక్కువ ఇచ్చినట్లయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తెలుగు వారంటే ప్రభాస్ కి ఎంత అభిమానమో మరోసారి రుజువయ్యింది. వరదలకు గురైన ప్రాంతాల్లో భోజన సదుపాయాలతో పాటు వాటర్ ఫెసిలిటీ ని కూడా ఏర్పాటు చేసాడు. కొన్ని రోజుల క్రితం కేరళ లోని వాయనాడ్ లో జరిగిన విపత్తు విషయంలో కూడా రెండు కోట్ల రూపాయాలని ఇవ్వడం జరిగింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.