English | Telugu

వైభవంగా మనోజ్‌ వివాహం

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌ వివాహం ప్రణతిరెడ్డితో అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగిన వివాహ వేడుకలకు పలువురు పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గవర్నర్‌ నరసింహన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, రజనీకాంత్‌, మహేష్‌బాబు, దర్శకులు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌, ఎంపీ మురళీ మోహన్‌, ఎంపీ సుబ్బరామిరెడ్డి, వైసీపీ అధినేత జగన్‌, బ్రహ్మానందం, ఈనాడు చైర్మన్‌ రామోజీరావు తదితరులు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు తమ ఆశీర్వచనాలు అందజేశారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.