English | Telugu

ప్రేమలో పడ్డాను..కాకపోతే బటన్ నొక్కలేను 

యువసామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya)హీరోగా తెరకెక్కిన 'ఒక లైలా కోసం' మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న భామ పూజ హెగ్డే(Pooja Hegde).ఆ తర్వాత దాదాపుగా అగ్ర హీరోలందరితోను జత కట్టి,నెంబర్ వన్ హీరోయిన్ పొజిషన్ ని కూడా అందుకుంది.దశాబ్ద కాలం పాటు తన హవా ని కొనసాగించిన పూజ, గత రెండు సంవత్సరాల నుంచి తెలుగులో కనిపించలేదు.ప్రస్తుతం హిందీలో షాహిద్ కపూర్(Shahid Kapoor)హీరోగా తెరకెక్కిన 'దేవా' లో హీరోయిన్ గా కీలక పాత్రని పోషించింది.

ఈ శుక్రవారమే 'దేవా' థియేటర్స్ లో అడుగుపెట్టింది.ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పూజ మాట్లాడుతు సినీ రంగ ప్రవేశం చేసి పది సంవత్సరాలు అవుతుంది మొదట్లో కెరీర్ ముందజలో సాగినా కూడా,ప్రస్తుతం మాత్రం హెచ్చు తగ్గులతో సాగుతుంది.కాకపోతే మొదటి సినిమా షూటింగ్ రోజు సెట్ లోకి వెళ్ళినప్పుడు ఎంత అనుభూతికి గురయ్యానో,ఇప్పటికీ అలాగే అనిపిస్తుంటుంది.బహుశా సినిమాలతో ఎక్కువగా ప్రేమలో పడ్డానేమో.అందుకే అవకాశాలు రాకపోయినా ఎప్పుడు నిరాశచెందలేదు.ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీలోను వరుస అవకాశాలు వస్తున్నాయి.కాకపోతే ఈ రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం కొంచం కష్టంగానే ఉంది.నాకు భాష కన్నా ఎంచుకున్న కథ ముఖ్యం. కొన్ని సార్లు ఎంచుకున్న క్యారక్టర్ కంటే,ఆ క్యారక్టర్ ల నుంచి బయటకి రావడానికే ఎక్కువ సమయం పడుతుంది.అందుకే నేను చాలా సార్లు నా దగ్గర స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ బటన్ లేదని చెప్తానని వెల్లడి చేసింది .

'దేవ' లో ఎలాంటి భయం లేకుండా నిజాలని వెలుగులోకి తీసుకొచ్చే ఇన్విస్టిగేషన్ జర్నలిస్ట్ దియా గా పూజ కనిపిస్తుంది.తమిళంలో సూర్య(Surya),కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj)కాంబోలో తెరకెక్కుతున్న 'రెట్రో'(Retro)లో కూడా హీరోయిన్ గా చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ శర వేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది.పూజ తెలుగులో చివరిగా 'f 3 'లో గెస్ట్ అప్పీరియన్సు ఇచ్చింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.